కంటి ఆరోగ్యం మెరుగుపడాలంటే?

Purushottham Vinay
ఈ రోజుల్లో చాలా మందికి కూడా చిన్న వయసులోనే కంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే కంటి పరీక్షలు చేయించుకోవడం వల్ల ఏవైనా కంటి సమస్యలు ఉంటే మనం స్టార్టింగ్ స్టేజ్ గుర్తించవచ్చు. దీంతో మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రతరం కాకుండా ఉంటుంది. ముఖ్యంగా మన చేతులతో తరుచూ కళ్లను తాకకూడదు. కళ్లను రుద్దకూడదు. అవసరమైతే మన చేతులను శుభ్రంగా కడిగి ఆ తరువాత కళ్లను తాకడం మంచిది. చేతులపై అనేక రకాల వైరస్, బ్యాక్టీరియాలు ఉండే అవకాశం ఉంటుంది. అదే చేతులతో కళ్లను తాకడం వల్ల కంటికి ఇన్పెక్షన్ లు వచ్చే అవకాశం ఉంది. కనుక చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. అలాగే కళ్లు పొడిబారకుండా ఉండడానికి గానూ రోజూ తగినన్ని నీళ్లు తాగడం చాలా అవసరం. నీరు తాగడం వల్ల కళ్లు పొడిబారకుండా ఉండడంతో పాటు కళ్ల ఎరుపుదనం కూడా తగ్గుతుంది. అలాగే రోజూ కంటి వ్యాయామాలు చేయడం కూడా చాలా అవసరం.


కంటి వ్యాయామాలు చేయడం వల్ల కంటి కండరాలు బలంగా తయారవుతాయి. దీంతో కంటిచూపు మెరుగుపడుతుంది.కంటి ఆరోగ్యం మెరుగుపడి దృష్టి లోపాలు తగ్గాలంటే టివి, సెల్ ఫోన్ వంటి వస్తువుల వాడకాన్ని తగ్గించడంతో పాటు సరైన ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. కంటి ఆరోగ్యం మరియు చూపు మెరుగుపడాలంటే మనం తీసుకోవాల్సిన ఆహారాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కంటి ఆరోగ్యం మెరుగుపడాలంటే పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. క్యారెట్, ఆకుకూరలు, సిట్రస్ పండ్లు, గింజలతో పాటు జింక్, కాపర్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం.మన శరీరంలో కళ్లు ముఖ్యమైన అవయవాలు. ఇవి మన జీవితంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయని చెప్పవచ్చు. మన శరీర ఆరోగ్య కోసం ఎంత శ్రద్ద తీసుకుంటామో మన కళ్ల ఆరోగ్యం గురించి కూడా అంతే శ్రద్ద తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా పైన తెలిపిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. కళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: