సమ్మర్లో శరీర ఉష్ణోగ్రతను వెంటనే తగ్గించే టిప్స్?

Purushottham Vinay
ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రతను వెంటనే తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎండా కాలంలో చాలా మంది ఎండ తీవ్రత కారణంగా తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. తల కూడా ఎప్పుడూ వేడిగా ఉంటుంది. అలాంటి వారు మెంతి గింజలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మెంతిగింజలను రాత్రంగా నానబెట్టాలి. తరువాత ఈ గింజలకు పెరుగు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను తలకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత జుట్టును నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల తల చల్లబడుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. ఇంకా వేసవికాలంలో ఎండ వల్ల చర్మం ఎర్రగా మారడంతో పాటు చర్మం మండడం, దద్దుర్లు వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇటువంటి సమస్యలతో బాధపడే వారు ముల్తానీ మట్టి, చందనం వంటి వాటిని చర్మానికి రాసుకోవాలి. ముల్తానీ మట్టిని లేదా చందనాన్ని రోజ్ వాటర్ తో కలిపి నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం చల్లబడడంతో పాటు శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది.


 అలాగే ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన తరువాత ముఖంపై, శరీరంపై ఐస్ ముక్కలతో మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎండ వల్ల ఎర్రగా మారిన చర్మం తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. అయితే నేరుగా చర్మంపై ఐస్ క్యూబ్స్ ను రాయడానికి బదులుగా ఒక చక్కటి కాటన్ వస్త్రంలో ఐస్ ముక్కలను ఉంచి చర్మంపై రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది.మనలో చాలా మంది శరీరం చల్లబడడానికి శీతల పానీయాలను, ఐస్ క్రీమ్స్ వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. ఇవి మన ఆరోగ్యానికి అంత మంచివి కావు.వీటికి బదులుగా శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి గానూ చల్లటి పాలను తాగాలి. అందులో తేనెను కూడా కలిపి తీసుకోవచ్చు. ఇలా చల్లటి పాలను తాగడం వల్ల శరీరం చల్లబడడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఇక ఇలా ఈ చిట్కాలను పాటించడం వల్ల శరీరం త్వరగా చల్లబడుతుంది. ఎండ వల్ల శరీరానికి హాని కలగకుండా ఉంటుంది.ఎండలో తిరిగే వారు ఈ చిట్కాలను పాటించడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: