బ్రష్.. ఎన్ని రోజులు ఉపయోగించాలో తెలుసా..?

Divya
మనం ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ కచ్చితంగా బ్రష్ చేయడం ఆనవాయితీగా మారింది.. జస్ట్ బ్రష్ చేయడమే కదా అని లైట్ గా తీసుకుంటున్నారా అయితే ప్రమాదంలో పడినట్టేనట.. దంతాలను బ్రష్ సరిగ్గా చేయకపోవడంతో పలు రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని ఇటీవలే కొంతమంది డెంటిస్టులు తెలియజేస్తున్నారు.. సక్రమంగా బ్రష్ చేయకపోవడం వల్ల గుండెజబ్బులు ,క్యాన్సర్ , వంటి డయాబెటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా గురయ్యేలా చేస్తున్నాయని తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా నోటిలో ఉండేటువంటి సూక్ష్మజీవులు దిగువుకు వెళ్లి కడుపులో ఆమ్లం పైన చాలా ప్రభావాన్ని చూపిస్తాయని ఇటీవలే అమెరికన్ పరిశోధకులు గుర్తించారట.

200 ప్రేగు క్యాన్సర్ కేసులను సైతం అక్కడ సైంటిస్టులు  గుర్తించినట్లు తెలుస్తోంది. సూక్ష్మజీవులు క్యాన్సర్ పురోగతిని ప్రేరేపిస్తాయని దీనివల్ల కాలక్రమమైన ప్రాణాంతకమైన వ్యాధిగా మారుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.. దంతాల అశుభ్రత పెద్ద ప్రేగు క్యాన్సర్ చాలా ప్రమాదానికి గురయ్యేలా చేస్తాయట.. అయితే నోటిలో కొన్ని సహజమైన బాక్టీరియాలో ఉంటాయని పరిశోధకులు చొప్పినప్పటికీ సరైన విధంగా బ్రష్ చేయకపోతే ఇవి పెద్ద ప్రేగుకు చేరుకొని క్యాన్సర్ ప్రమాదాన్ని సృష్టిస్తాయట.

నోటిలోని క్రిములు ఇతర శరీర భాగాలను కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా ఫ్యూసోబ్యాక్టీరియం, న్యూక్లియేటమ్ వంటి పిలవబడే బ్యాక్టీరియా కోలోరెక్టాల్ క్యాన్సర్ కారకాలకు దారితీస్తుందట.. అందుకే ప్రతి ఒక్కరు ఉదయం లేవగానే బ్రష్ చేయడం పైన కాస్త శ్రద్ధ వహించడం మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు.. శుభ్రమైన బ్రష్ చేయడం వల్ల ఆరోగ్యకరమైన గుండె తీరును కలిగిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే చాలామంది ఒకే బ్రష్ ను ఎక్కువ కాలం పాటు వాడుతున్న చాలా ప్రమాదమని కచ్చితంగా మూడు లేదా 6 నెలలకు ఒకసారి అయినా బ్రష్ ను మారుస్తూ ఉండాలని వైద్యుల సైతం తెలియజేస్తున్నారు. అప్పుడే దంతాలు చాలా శుభ్రంగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటాయని వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: