మన ప్రకృతి మనకు ప్రసాదించిన కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే కొబ్బరి నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను ఈజీగా రక్షిస్తాయి. లివర్ కణాలు చనిపోకుండా చూస్తాయి. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ కొబ్బరినీళ్లు అమోఘంగా పనిచేస్తాయి. నిత్యం కొబ్బరినీళ్లను తాగడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరినీళ్లను తాగకూడదని భ్రమ పడుతుంటారు. నిజానికి వారు కూడా పరిమిత మోతాదులో కొబ్బరినీళ్లను తాగవచ్చు. దీంతో ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. పోషకాలు అందుతాయి. డయేరియా వచ్చిన వారు శరీరంలో ఉన్న ద్రవాలను ఎక్కువ మోతాదులో కోల్పోతారు. అలాంటి వారు నీరసం చెందకుండా ఉండాలంటే.. కొబ్బరి నీళ్లను తాగాలి.పకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన కొబ్బరినీళ్లను తాగితే మనకు ఇంకా ఎక్కువ శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. అలసట తగ్గుతుంది. యాక్టివ్‌గా మారుతారు. ఎక్సర్‌సైజ్‌లు ఎక్కువగా చేసేవారు స్పోర్ట్స్ డ్రింక్స్‌కు బదులుగా కొబ్బరినీళ్లను తాగితే మంచి ఫలితం ఉంటుంది.
నిత్యం ఉదయం, సాయంత్రం 300 ఎంఎల్ మోతాదులో కొబ్బరినీళ్లను తాగితే హైబీపీ త్వరగా తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కొబ్బరినీళ్లలో గుండెకు మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. అందువల్ల హైబీపీ తగ్గుతుంది. అలాగే వేసవి కాలం వచ్చిందంటే చాలు ఖచ్చితంగా అధిక దాహం వేస్తుంది. మనలో ఎక్కువ శాతం మంది వేసవిలో కూల్ డ్రింక్స్ తాగుతారు. అయితే వాటికి బదులు కొబ్బరి నీళ్లను తాగితే ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు జరుగుతుంది. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది.డీ హైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. అలాగే కొందరు విరేచనాలను అరికట్టేందుకు కూడా కొబ్బరినీళ్లను తాగితే ఖచ్చితంగా తగ్గిపోతాయి.అందుకే కాలంతో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లు తాగండి. జీవితాంతం ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చాలా ఆరోగ్యంగా అందంగా ఉంటారు.