కంటి చూపు పెరగాలంటే ఇలా చేయాల్సిందే..!!
కంటి చూపు మెరుగుపరచడానికి కరివేపాకు ఒక దివ్య ఔషధంలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే బీటా కెరటి అనే పదార్థం పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటి చూపు మెరుగుపరచడంలో కూడా కీలకమైన పాత్ర వ్యవహరిస్తుంది. మన పూర్వపు పెద్దలు కూడా ఇంట్లో కరేపాకు చెట్టును తప్పకుండా పెంచుకునేవారు ఇది ఆహారంలో ఒక భాగంగా చేర్చుకొని తింటూ ఉండేవారు. కరేపాకు తో పాటు కొత్తిమీర, మునగాకు, పాలకూరలలో ఎక్కువగా బీటా కెరటిన్ వంటి పదార్థం ఉంటుంది.. ఇలాంటి ఆకుకూరలను సైతం వారంలో ఒక్కసారైనా తినడం వల్ల మరిన్ని లాభాలు ఉన్నాయి.
చేపలు కూడా తరచూ తినడం వల్ల ఒమేగా త్రీ వంటివి లభిస్తాయి ఇవి కంటి చూపు పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయి. పడుకునే ముందు ఐదు బాదం గింజలను నానబెట్టి ఉదయాన్నే వాటిని మెత్తగా నూరి మురియాల పొడి పటిక బెల్లం పొడిని వేసుకొని నెయ్యిలో కలిపి ప్రతి రోజు క్రమం తప్పకుండా రెండు నెలల పాటు తింటే అద్దాలు పెట్టుకోవలసిన అవసరమే ఉండదట. అంతేకాకుండా ఉసిరి వంటివి తినడంతో పాటు విటమిన్ ఏ ఉండేటువంటి మాంసాలను తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అప్పుడప్పుడు రెండు అరిచేతులను వృద్ధి కంటి రెప్పల మీద పెట్టుకోవడం వల్ల కంటికి అలసట కూడా తగ్గుతుందట. ఉదయం లేవగానే సూర్యరశ్మి తగిలేలా కంటిని చూసుకోవాలి. తరచూ నీరు ఎక్కువగా తాగడం వల్ల కూడా ఎక్కువ లాభాలు ఉన్నాయి.