టాయిలెట్ ఫ్లష్ చేసేటప్పుడు చేసే ఈ చిన్న తప్పు.. ఎన్నో వ్యాధులకు కారణం అవుతుందట?

praveen
ఈ మధ్యకాలంలో ఎంతోమంది ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం జాగ్రత్తగా ఉండడం లేదు  కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లపాటు హెల్త్ విషయంలో జాగ్రత్తలు పాటించినా ప్రస్తుతం మళ్ళీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా రోజువారి చేసే కొన్ని పనులు చివరికి అనారోగ్యాలకు కారణమవుతాయి అన్న విషయాన్ని ఎవరు గమనించడం లేదు. ఇలాంటి వాటిలో టాయిలెట్ ఫ్లష్ చేయడం కూడా ఒకటి. ఇక ఇటీవల కాలంలో ఒకప్పటిలా ఇండియన్ టాయిలెట్స్ కాకుండా ప్రతి ఇంట్లో కూడా వెస్టర్న్ టాయిలెట్స్ ని ఉపయోగించడం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక వెస్టర్న్  ఉపయోగించినప్పుడు తప్పకుండా ఫ్లష్ చేయడం చేస్తూ ఉంటారు.

 అయితే ఫ్లష్ చేసే అలవాటు అందరికీ ఉన్నప్పటికీ ఫ్లష్ చేసేముందు ఇక టాయిలెట్ యొక్క మూత మూసి వేయడం మాత్రం అందరూ మర్చిపోతూ ఉంటారు. ఇలా దీని కారణంగానే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయట  కులరాడో విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇటీవల షాకింగ్ విషయాలను తెలిపారు. టాయిలెట్ వాడిన తర్వాత ఫ్లష్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇక్కడి పరిశోధకులు ఒక ప్రయోగం చేశారు. టాయిలెట్ ఫ్లూమ్స్ ఎనిమిది సెకండ్లలో ఏకంగా 4.9 అడుగుల ఎత్తులో వ్యాప్తి చెందుతాయి అని గుర్తించారట పరిశోధకులు.

 ఇవి కంటికి కనిపించవట. టాయిలెట్ ఫ్లూమ్స్ చాలా చిన్న క్రిములుగా ఉంటాయట  ఇక మరింత ఆందోళనకర విషయం ఏమిటంటే.. ఇలా చేయడం వల్ల.. బాత్రూం చుట్టూ బ్యాక్టీరియా వైరస్ వ్యాప్తి చెందేలా చేస్తుందట. అంతేకాదు బాత్రూంలో ఉండే ఇతర వస్తువులు బ్రష్ టూత్ పేస్ట్ సహా ఇతర వస్తువులపై  కూడా ఆ క్రిములు చేరతాయట. ఇక మనుషులఫై కూడా ఈ క్రిములు చేరతాయట. అందుకే టాయిలెట్ వాడిన తర్వాత ఫ్లష్ చేయడానికి ముందు మూత మూసివేయాలి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు  ఒకవేళ ఇలా మూసి వేయకపోతే ఫ్లెషింగ్ తర్వాత ఫ్లూమ్స్ బ్యాక్టీరియా గాలి ద్వారా బాత్రూం మొత్తం వ్యాప్తి చెంది అవకాశం ఉందట. అందుకే ఇలా ఫ్లష్ చేసేముందు మూత వేయడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. ఇక పబ్లిక్ టాయిలెట్లలో ఇలా మూసీ వేయడానికి మూత లేకపోవడం వల్ల ఇక గాలిలో చేరే చిన్న చిన్న కణాల ద్వారా ఇన్ఫ్లు ఎంజా, కోవిడ్ -19 వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: