నిలబడి తింటున్నారా.. అయితే క్యాన్సర్ వచ్చినట్లే?

praveen
నేటి టెక్నాలజీ యుగంలో మనిషి జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి మార్పులు మనిషికి ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఆరోగ్యం గురించి పట్టించుకోవడమే మానేశాడు. మనీ వెంట పరుగులు పెడుతూ చివరికి కడుపునిండా తినడం కూడా మరిచిపోయాడు అని చెప్పాలి. దీంతో ఇక ఆఫీసుకు వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన ఎక్కడైనా టిఫిన్ సెంటర్ లేదంటే ఇంకేదైనా కనిపిస్తే అక్కడే కాసేపు ఆగి నిలబడి కంగారు కంగారుగా తిని కడుపు నింపుకోవడం తప్ప.. హాయిగా ఇంట్లో కూర్చుని ఇక ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటున్న రోజులు నేటి రోజుల్లో ఎక్కడ కనిపించట్లేదు.

 మరీ ముఖ్యంగా ఇలా నిలబడి తినడానికి బాగా అలవాటు పడిపోయాడు మనిషి. బయటికి వెళ్లినప్పుడు కూర్చోవడానికి ప్లేస్ ఉండదు. ఇక ఎక్కడో ఒకచోట నిలబడి ఇక అక్కడ కొనుక్కున్న ఆహారాన్ని తిని వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఇక కూర్చోవడం ఎందుకు నిలబడి తింటే బాగానే ఉంది కదా అనుకుంటూ ఉన్నారు అందరు. ఈ క్రమంలోనే ఏదో ఒకటి హడావిడిగా నిలబడి తింటూ కడుపు నింపుకొని ఇక రోజువారి పనులు చేసుకోవడం చేస్తూ ఉన్నారు. అయితే ఇలా కూర్చునే అంత తీరిక లేకుండా ఉన్న మనిషి చివరికి నిలబడి ఆహారాన్ని తింటూ ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాడు అన్నది తెలుస్తుంది.

 ఇలా కంగారుగా నిలబడి తింటూ ఇక పని మీద పరుగులు పెడుతూ జీవనం సాగించడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. నిలబడి తినడం ద్వారా పొట్ట పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరిస్తూ ఉన్నారు. నిలబడి ఆహారం తీసుకోవడం ద్వారా అన్నవాహక దెబ్బతింటుంది అని నిపుణులు చెబుతూ ఉన్నారు అంతేకాకుండా. ఇలా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా జీర్ణ ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుందని పేగులపై ఒత్తిడి పెరుగుతుంది అంటూ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎంత టైం లేకపోయినా కూర్చుని తినడమే మేలు అంటూ సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: