మనలో చాలా మంది కూడా చలికాలంలో అరటిపండును తీసుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇవి చల్లగా ఉంటాయి కాబట్టి చలికాలంలో అరటిపండును తీసుకోవడం వల్ల దగ్గు, కఫం వంటి సమస్యలు వస్తాయని చాలా మంది చాలా రకాలుగా భయపడతారు. అసలు మనం చలికాలంలో అరటిపండును తీసుకోవచ్చా… చలికాలంలో అరటిపండును తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో అరటిపండును తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ చలికాలంలో అరటిపండును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు. చలికాలంలో మన శరీరంలో జీర్ణక్రియ కూడా నెమ్మదిగా ఉంటుంది.అలాంటప్పుడు అరటిపండును తీసుకోవడం వల్ల దానిలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది.అరటిపండ్లు చల్లటి ఆహారాలు. వీటితో మిల్క్ షేక్స్ వంటి మరింత చల్లటి ఆహారాలను తయారు చేసి తీసుకోకూడదు. దీంతో ఇన్పెక్షన్ లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో అరటిపండ్లను తీసుకున్నప్పటికి మితంగా తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, ఉబ్బసం, కఫం,శ్లేష్మం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రాత్రిపూట అరటిపండ్లను తీసుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారు అస్సలు తీసుకోకకూడదని నిపుణులు చెబుతున్నారు.చలికాలంలో ఎముకలు విరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
చలికాలంలో అరటిపండ్లను తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత పెరగడంతో పాటు ఎముకలు ధృడంగా తయారవుతాయి. అదే విధంగా చలికాలంలో చాలా మందికి ఎప్పుడూ నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కనుక అరటిపండును తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. నీరసం, బలహీనత దరి చేరకుండా ఉంటాయి. చలికాలంలో వీటిని మధ్యాహ్న సమయంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే సాయంత్రం పూట రోజూ రెండు అరటి పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి లభిస్తుంది. దీంతో రాత్రి సమయంలో చక్కగా నిద్రపడుతుంది. చలికాలంలో అరటిపండ్లను తీసుకోవడం వల్ల ఈ విధంగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.