మూత్రం పసుపు రంగులో ఎందుకు ఉంటుంది.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు?
కానీ ఇలా యూరిన్ పసుపు రంగులో రావడానికి ఖచ్చితమైన కారణం ఏంటి అంటే మాత్రం ఎవరు చెప్పలేరు. అయితే ఇటీవలే మేరీ ల్యాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇదే విషయంపై పరిశోధనలు జరిపారూ. ఈ క్రమంలోనే మూత్రం పసుపుపచ్చ రంగులో ఉండడానికి కారణం ఏంటి అన్న విషయాన్ని సదర శాస్త్రవేత్తలు గుర్తించారు అని చెప్పాలి. దీనికి సంబంధించి నేచర్ మైక్రోబయాలజీ జర్నల్ లో ఒక కథనం కూడా ప్రచురితమైంది. సాధారణంగా మూత్రంలో నీరు ఎలక్ట్రోలైట్లు మూతపిండాలు వడబోసిన రక్తంలోని వ్యర్ధాలు ఉంటాయి.
అయితే ఇది పసుపు పచ్చ రంగులో ఉండడానికి యూరోబీలన్ అనే ఎంజైయ్ కారణమట. దాదాపు 125 ఏళ్ల క్రితమే పరిశోధనలో దీనిని గుర్తించారు. కానీ ఇది ఎక్కడి నుంచి విడుదలవుతుంది అన్నది మాత్రం ఇప్పటికీ తెలియదు. మూత్రం పసుపు రంగులో ఉండడానికి ఎర్ర రక్త కణాలకు సంబంధం ఉంటుందని.. ఇటీవల జరిపిన పరిశోధనలో తేలింది. ఎర్ర రక్త కణాలు విచిన్నమైన తర్వాత బిలీరూబీన్ అనే నారింజ రంగూ వర్ణ ద్రవాన్ని విడుదల చేస్తాయట. ఇక ఇది జీర్ణాశయంలోకి చేరుకున్న తర్వాత ఉపయోగకరమైన బ్యాక్టీరియా దీనిని వివిధ వివిధ అణువులుగా మారుస్తుందట. ఈ క్రమంలోనే యూరోబిలినోజెన్ అనే రంగులేని ఒక ఉప ఉత్పత్తి తయారై అది క్రమంగా పసుపు పచ్చ రంగులో ఉండే యూరోబిలిన్ గా మారి మూత్రం ద్వారా బయటికి వస్తుందట. ఇటీవల జరిగిన అధ్యయనంలో బయటపడిన విషయాలతో జీర్ణాశయ వ్యాధులకు సంబంధించిన మరిన్ని అంశాలపై స్టడీ చేసేందుకు అవకాశం కలిగిందని పరిశోధకులు చెబుతూ ఉండడం గమనార్హం.