రోజు జాజికాయ పొడి తింటే ఏమవుతుందో తెలుసా..?

Divya
సాధారణంగా వంటల్లోను,జ్యూస్ లలోనూ సువాసన కోసం ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో జాజికాయ ముఖ్యమైనదిగా చెప్పవచ్చు.దీనిని ఒక పించ్ వాడినా సరే తియ్యని సువాసనతో చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.అందుకే దీన్ని ఎక్కువగా పాన్ తయారీలో ఉపయోగిస్తుంటారు.మసాలా వంటల్లో అయితే దీన్ని మరింత ఎక్కువగా వాడుతారు.మరీ కొందరు అయితే చర్మ సంరక్షణలో ఉపయోగించే చిట్కాలలో వాడతారు. ఎందుకంటే ఇందులో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి కనుక.ఈ పొడిని రోజూ ఓ చిటికెడు తింటే వెలకట్టలేనన్ని లాభాలు కలుగుతాయి. మరీ అవేంటో తెలుసుకుందాం పదండీ..
ముఖ్యంగా బరువు తగ్గడానికి ఇది భలే సహాయపడుతుంది.కొంతమంది కొంచెం తిన్నా కూడా తొందరగా బరువు పెరగడమనే సమస్యతో బాధపడుతుంటారు.దీనివల్ల వారు ఒత్తిడికి గురై అదే పనిగా ఆహారం తినాలని కోరిక పెరుగుతుంది.మరీ ముఖ్యంగా తీపి పదార్థాలు,బేకరీ ఫుడ్స్,ఆయిల్ ఫుడ్స్,రుచికరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.కానీ జాజికాయ పొడిని ఒక పించ్ అంత తీసుకుంటూ ఉంటే,ఆహారం కావాలనే కోరికను తగ్గిస్తుంది.దానితో తొందరగా బరువు తగ్గుతారు.
అంతే కాక చాలామంది ఆఫీస్ టెన్షన్స్,ఇంట్లో టెన్షన్స్ అంటూ తెగ ఒత్తిడి పడుతూ ఉంటారు.ఇలా ఒత్తిడి పడుతూ వారు క్రమంగా గుండె జబ్బులు,అల్జీమర్స్  పొట్ట సమస్యలు వంటి తెచ్చుకుంటూ ఉంటారు.అలాంటి వారికి జాజికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది.జాజికాయలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించి,ఇవి ఒత్తిడిని అదుపులోకీ తెస్తాయి.ఇవి ఆక్సీరణ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
మరియు చాలామంది ఈ మధ్యకాలంలో నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు.దీనికి కారణం బ్లూ స్క్రీన్ కలిగిన టీవీలు మొబైల్ లో ఎక్కువగా చూడడం,అనవసరమైన ఆలోచనలు చేయడం వల్ల నిద్ర సరిగా పట్టదు.దీనివల్ల ఎన్నో రకాల రోగాలు గురికావాల్సి వస్తుంది.కావున మీరు కూడా ఇలాంటి నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటే,వెంటనే ఒక గ్లాసు పాలలో జాజికాయ పొడిని వేసి తాగడం అలవాటు చేసుకోండి. ఇది క్రమంగా మెలటోనీన్ సరిగా ఉత్పత్తి చేసి,నిద్రలేమి సమస్యను పోగొడుతుంది.అంతేకాక రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ని కూడా క్రమబద్ధీకరిస్తుంది.
ఆరోగ్యకరమైన జీవితానికి ప్రతి ఒక్కరూ వేడి పాలలో ఒక పించ్ జాజికాయ పొడిని వేసుకుని తాగడం అలవాటు చేసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: