ఇలా చేస్తే సారా తాగినా లివర్ పాడవ్వదు?

Purushottham Vinay
ఆల్కాహాల్ ను తీసుకోవడం వల్ల  కాలేయం పూర్తిగా దెబ్బతినే అవకాశాలు  ఉంటాయి. ఈ అలవాటు వల్ల జీవితాలు కూడా నాశనం అవుతాయి. ఎంత మంది ఎన్ని సార్లు చెప్పినా కూడా కొంతమంది ఈ ఆల్కాహాల్ ను తీసుకోవడం మానరు. అలాంటి వారు ప్రతి రోజూ ఒక గ్లాస్ ద్రాక్ష పండ్ల రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాన్ని దాదాపుగా ద్రాక్ష పండ్ల రసం నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ద్రాక్ష పండ్ల రసంలో నిరింజిన్, నిరింజినిన్ అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి.హాఫ్ లీటర్ ద్రాక్ష పండ్ల రసంలో 300 నుండి 350 మిల్లీగ్రాముల మోతాదులో ఈ రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ద్రాక్ష పండ్లల్లో ఉండే ఈ రసాయన సమ్మేళనాలు కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో బాగా సహాయపడతాయి. ఆల్కాహాల్ వల్ల కాలేయ కణాల్లో ఇన్ ప్లామేషన్ రాకుండా కాపాడడంలో ఇవి మనకు దోహదపడతాయి.


ఇంకా అలాగే ద్రాక్ష పండ్ల రసాన్ని తీసుకోవడం వల్ల కాలేయ కణాల్లో ఉండే సైటో ప్లాసమ్ బటయకు రాకుండా ఉంటుంది.ఇక కాలేయ కణాలు దెబ్బతినకుండా చేయడంలో ద్రాక్ష పండ్ల రసం బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే ద్రాక్ష పండ్ల రసాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఎడిహెచ్ ఎక్కువగా విడుదల అవుతుంది.ఈ ఎడిహెచ్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఆల్కాహాల్ త్వరగా విడిపోతుంది. దీనివల్ల ఆల్కాహాల్ కారణంగా కాలేయానికి జరిగే నష్టం తగ్గుతుంది. ఈ విధంగా ద్రాక్ష పండ్ల రసం ఆల్కాహాల్ తాగే వారికి చాలా మేలు చేస్తుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. కాబట్టి ప్రతి రోజూ ఆల్కాహాల్ తీసుకునే వారు ఆల్కాహాల్ తో పాటు 400 నుండి 500 ఎమ్ ఎల్ ద్రాక్ష పండ్ల రసాన్ని కూడా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ద్రాక్ష పండ్ల రసాన్ని తీసుకోవడం వల్ల కాలేయంతో శరీరానికి కూడా చాలా విధాలుగా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: