కంటి చూపును మెరుగుపరిచే కరివేపాకు జ్యూస్ తాగండిలా..!

Divya
ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మందికి స్పెడ్స్ లేనిదే పక్కన వారి పేస్ కూడా క్లియర్ గా చూడలేకపోతున్నారు.దానికి కారణం మనం తీసుకొనే ఆహారాలలో సరైన పోషకాలు లేకపోవడం,బ్లూ స్క్రీన్ ఎక్కువగా చూడటం,వంశపార్యంపర్యంగా వచ్చే జీన్స్ వల్ల కంటి చూపు దెబ్బతింటూ వుంది.వంశపార్యంపర్యంగా వచ్చే వ్యాధులను కంట్రోల్ చేయలేము కానీ, మన చేతుల్లో కంట్రోల్ చేయగలిగే పనులు మాత్రం కచ్చితంగా చేసి,కంటి చూపును మెరుగుపరుచుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.మరి ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలతో తయారుచేసిన జ్యూస్ తరుచూ తీసుకోవడం వల్ల కంటి సమస్యలను పోగొట్టుకోవచ్చని పోగొట్టుకోవచ్చు అని ఆహార నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పదార్థాలు ఏంటో ఆ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో మనము తెలుసుకుందాం పదండి..
సాధారణంగా విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో చాలా బాగా పనిచేస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు.మాంసాహారంలో ఎక్కువగా విటమిన్ ఏ లభిస్తుంది.కానీ శాఖాహారులు ఇది బీటా కెరటిన్ రూపంలో లభిస్తుంది.ఈ ఆహారాలను మనం తీసుకున్నప్పుడు బీటా కెరోటీన్ కాలేయంలోకి వెళ్లి విటమిన్ ఏ గా మారుతుంది.విటమిన్ ఏ అధికంగా ఉన్న కరివేపాకుతో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని పరిశోధనలో కూడా తేలింది.
ఇలాంటి జ్యూస్ కి ముందుగా గుప్పెడు కరివేపాకు తీసుకొని,బాగా శుభ్రం చేసి మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇందులోనే అరకప్పు క్యారెట్ ముక్కలు అరకప్పు  కీరా ముక్కలు,రెండు టేబుల్ స్పూన్ల తేనె,ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్సీ పట్టుకొని జ్యూస్ తయారు చేసుకోవాలి.దీనిని అలాగే తాగవచ్చు లేదా అలా తాగలేని వారు వడకట్టి తీసుకోవచ్చు.అందులో వచ్చే పల్ప్ ముఖానికి పేస్ ఫ్యాక్ వేసుకోవడం ద్వారా మెరుగుపర్చుకోవచ్చు.
ఈ జ్యుస్ ని ఉదయం సమయంలో తీసుకుంటే,మంచి పోషకాలు లభించి,కంటి చూపు మెరుగుపడుతుంది. నీతో పాటు బ్లూ స్క్రీన్ తక్కువగా చూడడం,నీటిని ఎక్కువగా తీసుకోవడం,ఫేషియల్ ఎక్సర్సైజ్ వంటివి చేయడం అలవాటు చేసుకోవడం ద్వారా కూడా కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: