ఉల్లిపాయలను కట్ చేసి అలా చేస్తున్నారా ఎంత ప్రమాదమో తెలుసా..?
ఇలా ఉల్లిపాయలను కట్ చేసి ఫ్రిజ్లో పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుందట.వీటిని తినడం వల్ల ఆ వ్యక్తులు పలు అనారోగ్య సమస్యలను సైతం గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా కట్ చేసి ఫ్రిజ్లో ఉల్లిపాయలను ఉంచితే అవి చెడు వాసన కూడా వస్తుంది దీనివల్ల ఫ్రిజ్లో ఉంచిన ఇతర ఆహార పదార్థాలకు కూడా వ్యాప్తి చెందేలా చూస్తాయి. ఇవి రుచి కూడా కోల్పోవడం జరుగుతుందట. ఉల్లిపాయలలో కోసిన తర్వాత తేమ ఎక్కువగా ఉంటుంది.
వాటి తేమ వల్ల అవి వ్యాధికారకాలకు సైతం జారుతీస్తాయట. ఇందులో ఉండే పోషకాలు కూడా తగ్గిపోతాయి బ్యాక్టీరియా కూడా ఫ్రిడ్జ్ లోపల పెరుగుతుందట. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల చల్లని ఉష్ణోగ్రతలతో ఎంజైములను కలిగి ఉంటాయి దీనివల్ల సల్ఫరస్ సమ్మేళనాలు కూడా ఏర్పడతాయట. దీనివల్ల ఏదైనా వంటలోకి వీటిని వేశారంటే అవి చేదుగా కనిపిస్తాయి.. మరి కొంతమంది ఉల్లిపాయల పైన తోలు తీసేసి నిల్వ చేయడం కూడా మరొక ప్రమాదం ఉన్నదట. ఇవి ఎన్నో బ్యాక్టీరియాకు సైతం నిలువ ఉంచేలా చేస్తాయట.. అయితే ఉల్లిపాయలను 40 డిగ్రీల ఫారెన్హీట్ లో నైన ఫ్రిడ్జ్ లోపల..4.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉంచితేనే ఉత్తమమైన మార్గమని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు..