నోట్లో వచ్చే పుండ్లకు ఒక్క రోజులో చెక్ పెట్టండిలా..!
జామాకు..
ఇలా నోటిలో పుల్లతో బాధపడే వారికి జామాకు చాలా బాగా పనిచేస్తుంది.వీటితో బాధపడేవారు ఉదయం లేవగానే జామాకు తీసుకొని,బాగా శుభ్రం చేసి అందులో ఉప్పు పెట్టి,నమలడం ద్వారా తొందరగా పుండ్లు నయం అవుతాయి.ఇది ఒక్క రోజులోనే ఉపశమనం కలిగినట్టు కచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది.జామకులో ఉన్న విటమిన్ సి మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుండ్లను తొందరగా నయం చేస్తుంది.
కొబ్బరి పాలు..
నోటిలో పుండ్లతో బాధపడేవారు కొబ్బరి పాలను రోజు ఉదయం,సాయంత్రం పుక్కలించడంతో మంచి ఉపశమనం కలిగిస్తాయి.కొబ్బరిపాలలోని యాంటీ మైక్రోబియల్,యాంటీ వైరల్ గుణాలు నోటి పుండ్లను తగ్గిస్తాయి.
లవంగనూనె..
లవంగ నూనెలో ‘యూజెనాల్’ అనే లక్షణం ఉండడం వల్ల, తొందరగా పుండ్లను మాన్పడంలో సహాయపడుతుంది.దీనిని పుండ్లపై అద్దినప్పుడు మంట పుడుతుంది.కానీ ఒక్కరోజులోనే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఉప్పునీరు..
నోట్లో పుండ్లతో బాధపడేవారు రోజుకు రెండు సార్లు చొప్పున ఉప్పు నీళ్లను తీసుకొని పుక్కిలించడంతో తొందరగా నోటిలోని పుండ్లకు ఉపశమనం కలుగుతుంది. ఉప్పునీటిలో చెడు బ్యాక్టీరియాను చంపేయకుండా ఎక్కువగా ఉంటుంది.
తేనె..
వీటితో బాధపడేవారు తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటి వారికి తేనె మంచి మందు అని చెప్పవచ్చు.తేనెను గంటకొకసారి ఆ పుండ్లపై అద్దడం వల్ల రోజులోనే పుండ్లు మానడం మనం గమనిస్తాము.
కావున మీరు కానీ,మీ కుటుంబ సభ్యులు కానీ,ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే ఈ నివారణలు పాటించండి.