ఫ్యాటీ లివర్ బాధితులు తీసుకోవాల్సిన ఆహార నియమాలు?
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్‌పై చేసిన ఆనేక పరిశోధనల ప్రకారం ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఆ సమస్య నుంచి బయట పడడానికి వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వెల్లుల్లిలో కొవ్వును తగ్గించగల శక్తితో పాటు ఆరోగ్యాన్ని కాపాడగల చాలా పోషకాలు ఉన్నాయి.ఇంకా యాంటీ ఆక్సిడెంట్లను సమృద్ధిగా కలిగిన గ్రీన్ టీ ఫ్యాటీ లివర్‌కి చెక్ పెట్టడంలో మెరుగ్గా పని చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కణాలను రిపేర్ చేయడంతో పాటు బరువు తగ్గడంలో కూడా చాలా బాగా సహాయపడతాయి.ఇంకా అలాగే మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఇంకా అలాగే ఫ్యాటీ లివర్‌తో బాధ పడుతున్నవారికి అవకాడో ఖచ్చితంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ అవకాడోలోని పోషకాలు ఫ్యాటీ లివర్ని తగ్గించి కాలేయాన్ని ఎంతో సురక్షితంగా ఉంచడంతో పాటు బరువు తగ్గేవారికి కూడా ఉపకరిస్తుంది.ఇక ఫ్యాటీ లివర్‌తో బాధ పడుతున్నవారు పాస్తా, ఫ్రైడ్ రైస్, వైట్ బ్రెడ్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్‌కి ఖచ్చితంగా చాలా దూరంగా ఉండాలి.ఎందుకంటే ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ కూడా ఈజీగా పెరుగుతాయి.ఇక షుగర్ అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి.చక్కెర పెరిగినప్పుడు కాలేయంలో ఎక్కువ కొవ్వు కూడా పేరుకుపోతుంది. దాని ఫలితంగా ఫ్యాటీ లివర్ సమస్య ఖచ్చితంగా మరితం తీవ్రతరం అవుతుంది. ఈ కారణంగా చాక్లెట్, లడ్డూ, ఐస్ క్రీమ్ ఇంకా కూల్ డ్రింక్ వంటి షుగర్ ఎక్కువగా ఉంటే పదార్థాలను తీసుకోకుండా ఉండడమే చాలా మంచిది.కాబట్టి ఫ్యాటి లివర్ సమస్యతో బాధ పడేవారు ఖచ్చితంగా తీసుకునే ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి.ఆరోగ్యంగా ఉండండి.