కంటి కింద నలుపు పోగొట్టాలంటే రెమిడీలు ఫాలో అవ్వాల్సిందే..?

Divya
చాలామందికి కంప్యూటర్లు,మొబైల్ ఫోన్లు,సరయిన నిద్ర లేకపోవడం,అధిక మసాలాలు వంటివి తీసుకోవడం, అధిక చక్కెరలు తీసుకోవడం వంటి కారణాల వల్ల,కంటి కింద నల్లని చారలు ఏర్పడుతూ ఉంటాయి.ఆ నల్లటి వలయాలు ముఖాన్ని అందవిహీనంగా మారుస్తాయి. వాటిని తొలగించుకోవాలని రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతూ ఈ పోక తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు.


అలాంటివారు ముందుగా వారి జీవనశైలిని మార్చుకోవాల్సిందే.ముందుగా కంప్యూటర్లు,మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి వారి కోసం మన ఇంట్లో నేచురల్ గా దొరికే కొన్ని ప్రాడెక్ట్స్ వాడటం వల్ల వారం రోజుల్లోగా నల్లటి వలయాలను తొందరగా పోగొట్టుకోవచ్చని చర్మనిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు.అంతేకాక ఈ చిట్కాలు ఎలాంటి చర్మ సమస్యలు కూడా దరిచేరనీయవు.అవేంటో మనము తెలుసుకుందాం పదండీ..

చిట్కా 1:ఈ చిట్కాను పాటించేందుకుముందుగా ఒక స్పూన్ పసుపు,ఒక స్ఫూన్ కాఫీ పొడి,రెండు టేబుల్ స్పూన్ల తేనె తీసుకొని బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని నల్లటి వలయాలపై అప్లై చేసే ముందు ముఖాన్ని బాగా శుభ్రపరచుకుని,ఆ తర్వాత అప్లై చేసుకోవాలి.ఇలా ఈ మిశ్రమం బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరి.ఈ చిట్కా పాటించే ముందు, కంటిలోకీ పడకుండా జాగ్రత్తగా కూడా తీసుకోవాలి ఎందుకంటే కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి కావున. ఈ చిట్కాను వారం రోజులు క్రమం తప్పకుండా పాటించడం వల్ల నల్లటి వలయాలు వారంలోగాతగ్గే అవకాశం ఉంటుంది.

చిట్కా 2: ఈ చిట్కా కోసం ముందుగా ఒక అరటిపండు తొక్కను తీసుకొని,కాసేపు ఫ్రిజ్లో ఉంచుకోవాలి.ఆ తర్వాత ఒక గిన్నెలో ఒక స్పూన్ శనగపిండి,చిటికెడు పసుపు,తగినన్ని పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిజ్లో పెట్టిన అరటిపండు తొక్కను తీసుకొని,ఈ మిశ్రమాన్ని అప్లై చేసి,కంటి కింద పట్టులా వేసి,అరగంట సేపు అలాగే ఉంచాలి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మెల్లగా రుద్దుతూ శుభ్రం చేసుకుంటే సరి.ఈ చిట్కాని వారం రోజులు పాటు ఫాలో అవ్వడంతో నల్లటి వలయాలు తగ్గడమే కాకుండా,ముఖం కూడా అందంగా తయారవుతుంది.మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చిట్కాని తొందరగా పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: