తలనొప్పి చిటికెలో తగ్గే టిప్స్?

Purushottham Vinay
తలనొప్పి చిటికెలో తగ్గే టిప్స్?


చాలా మందికి కూడా తలనొప్పి ఎక్కువగా వస్తూంటుంది.అయితే తలనొప్పికి ఒకటి అంటూ కారణం ఉండదు. పని ఒత్తిడి, నిద్రలేమి, టెన్షన్ ఇంకా జన్యుపరమైన సమ్యలు ఇలా చాలా రకాల కారణాలు ఉంటాయి.ఈ తలనొప్పి వల్ల విపరీతమైన చిరాకు, కోపం ఇంకా అసహనం కలుగుతాయి. ఇక ఒక్కోసారి తలనొప్పి విపరీతంగా ఉంటే కొంత మందికి వాంతులు కూడా ఎక్కువగా వస్తాయి. అయితే తలనొప్పికి భరించలేక చాలా మంది ట్యాబ్లెట్స్ వేసుకుంటూంటారు. అలా ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా ముందుగా కొన్ని టిప్స్ పాటిస్తే ఆ సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చు.తలనొప్పికి డీ హైడ్రేషన్ అనేది  ఒక కారణం కావచ్చు. మీకు తలనొప్పిగా అనిపిస్తున్నప్పుడు ఒక గ్లాస్ నీళ్లు తాగడం చాలా మంచిది. అలాగే గంధాన్ని నుదుటిపై రాసినా కూడా ఉపశమనం పొందవచ్చు. మీకు తలనొప్పిగా ఉన్నప్పుడు కాస్త గోరువెచ్చని నీటితో తల స్నానం చేస్తే మంచి రిలీఫ్ వస్తుంది.



అలాగే పంటినొప్పి, కంటి నొప్పి ఉన్నా కూడా అది తలనొప్పికి దారి తీస్తుంది.అలాగే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోయినా తలనొప్పి వస్తుంది.మీకు తలనొప్పిగా ఉన్నప్పుడు కాస్త ప్రశాంతంగా కూర్చొని.. బ్రీథింగ్ వర్కౌట్స్ చేసినా కూడా చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. ఇది మీ తలకు ఆక్సిజన్ ని అందించి సహాయం చేస్తోంది.ఇంకా అలాగే మెదడుకి సంబంధించిన నరాలు చెవి ప్రాంతాన్ని కలిపి ఉంటాయి. మన చెవి వెనుక భాగంలో కాస్త మస్తాజ్ చేసి, చెవిని కిందికి పైకి కొద్దిగా లాగడం మంచిది. అలాగే నుదురు, తలపై మసాజ్ చేసుకోవడం ఇంకా నాసికా రంధ్రాలపై నుంచి కింది దాకా మసాజ్ చేయడం అలాగే ఐస్ తో కూడా నుదుటిపై మసాజ్ చేసుకోవచ్చు.కాబట్టి తలనొప్పితో బాధ పడేవారు ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. ఈజీగా తలనొప్పి తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: