ఈ కొత్తిమీర వంటకం ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?

Purushottham Vinay
కొత్తిమీరలో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు  దాగి ఉన్నాయి. మన ఆరోగ్యానికి చాలా మేలు చేసే ఈ కొత్తిమీరతో మనం కొత్తిమీర రైస్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కొత్తిమీర రైస్ చాలా రుచిగా ఉంటుంది.దీనిని తయారు చేయడం కూడా చాలా ఈజీ.మనకు ఇంట్లో తినగా మిగిలిన అన్నంతో కూడా ఈ కొత్తిమీర రైస్ ను తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉండే కొత్తిమీర రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ముందుగా మీరు కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి దానిని వేడి చేయాలి. ఇక ఆ నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, టమాట ముక్కలు వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించాలి.తరువాత కొత్తిమీర వేసి కలపాలి. ఆ తరువాత దీనిపై మూత పెట్టి కొత్తిమీర, టమాట ముక్కలు పూర్తిగా మెత్తగా అయ్యే దాకా మగ్గించాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని దానిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనెని వేసి వేడి చేయాలి. 


ఆ నూనె వేడయ్యాక మసాలా దినుసులు కూడా వేసి వేయించాలి. తరువాత జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలని వేసి వేయించాలి. ఇక ఇవి కొద్దిగా వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి.ఆ ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే దాకా వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అందులో వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే దాకా వేయించిన తరువాత ఉప్పు వేసి కలపాలి. తరువాత ఉడికించిన అన్నం అందులో వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే కొత్తిమీర రైస్ తయారవుతుంది. దీనిని రైతాతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. తరచూ చేసే రైస్ వెరైటీలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కొత్తిమీర రైస్ ను కూడా మీరు తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ చాలా ఇష్టంగా తింటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: