పొద్దున్నే ఇది తింటే ఏ రోగం రాదు?

Purushottham Vinay
 రాగి అటుకులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.రాగులతో చేసే ఈ అటుకులు చూడటానికి చిన్నగా తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఇవి మనకు సూపర్ మార్కెట్ లలో ఇంకా ఆన్ లైన్ లో చాలా సులభంగా లభిస్తాయి.రాగుల లాగే ఈ అటుకులు కూడా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఈ రాగి అటుకులతో మనం రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ ను తయారు చేసుకుని తినవచ్చు.ఈ బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు ఈజీగా లభిస్తాయి.అలాగే రోజంతా చాలా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. ఇంకా నీరసం మన దరి చేరుకుండా ఉంటుంది. ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి.శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా తగ్గుతాయి. ఇంకా బరువు తగ్గాలనుకునే వారు ఈ బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి అటుకుల బ్రేక్ ఫాస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


రాగి అటుకుల బ్రేక్ ఫాస్ట్ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు బాదంపప్పుపై ఉండే పొట్టును తీసేసి ఒక జార్ లోకి తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో నీళ్లు, పటిక బెల్లం వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత ఒక గిన్నెలో రాగి అటుకులను తీసుకోవాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న బాదంపాలు ఇంకా నానబెట్టిన చియా గింజలు వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇక ఈ అటుకులను వెంటనే తినడం వల్ల కరకరలాడుతూ ఉంటాయి. అదే 5 నిమిషాల తరువాత తింటే అటుకుల నానిపోయి అవి మెత్తగా ఉంటాయి. ఈ విధంగా రాగి అటుకులతో రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ ను తయారు చేసుకుని  తినడం వల్ల రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు రోజు మీ బ్రేక్ ఫాస్ట్ గా తయారు చేసుకొని తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: