సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ ఆకుకూర ఖచ్చితంగా తినండి?

Purushottham Vinay
మన బాడీకి అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్స్ లో విటమిన్ బి 12 కూడా ఒకటి. నాడీ మండల వ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేయడంలో, రక్తకణాల తయారీలో, కణజాలం  ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ బి 12  చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన బాడీలో మనకు తగినంత విటమిన్ బి 12 ఉండడం చాలా అవసరం.లేదంటే మనం చాలా అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా నరాలకు సంబంధించిన సమస్యలు, అరికాళ్లల్లో మంటలు, సూదులతో గుచ్చినట్టుగా ఉండడం, చిరాకు, కోపం, ఆందోళన ఇంకా అసలు ఏ పని మీద కూడా ఏకాగ్రత చూపించలేకపోవడం అలాగే మతిమరుపు వంటి సమస్యలు విటమిన్ బి 12 లోపించడం వల్ల ఎక్కువగా తలెత్తుతాయి.ఇంకా అలాగే కొందరిలో విటమిన్ బి 12 లోపించడం వల్ల విరోచనాలు, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్దకం ఇంకా రక్తహీనత వంటి సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి.ఈ సమస్యల నుండి బయటపడాలంటే విటమిన్ బి 12 ఎక్కువగా ఉండే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విటమిన్ బి 12 అనేది ఎక్కువగా మాంసాహారంలో ఉంటుంది. ఇంకా అలాగే పాలను తీసుకోవడం వల్ల కూడా మనం విటమిన్ బి 12 లోపాన్ని ఈజీగా అధిగమించవచ్చు.


 ప్రతి రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగడం వల్ల విటమిన్ బి 12 లోపాన్ని చాలా ఈజీగా అధిగమించవచ్చు. ఇంకా అదే విధంగా పెరుగు, చీజ్, కోడిగుడ్లు ఇంకా పాలకూర వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ బి 12 లభిస్తుంది.అలాగే వారానికి రెండు నుండి మూడు సార్లు పాలకూరను తీసుకోవడం వల్ల కూడా ఈ విటమిన్ బి 12 లోపాన్ని ఈజీగా అధిగమించవచ్చు.అయితే చాలా మంది కూడా పాలకూరను తరిగి నీటిలో కడుగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల విటమిన్ బి 12 నీటి ద్వారా ఈజీగా తొలగిపోతుంది. కాబట్టి పాలకూరను కడిగిన తరువాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా అలాగే క్యారెట్ జ్యూస్ ను తాగడం వల్ల, శనగలను ఉడికించి లేదా మొలకెత్తించి తీసుకోవడం వల్ల విటమిన్ బి 12 లోపాన్ని ఈజీగా అధిగమించవచ్చు.ఇక ఈ విధంగా పైన చెప్పిన ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ బి 12 లభిస్తుందని ప్రతి ఒక్కరు కూడా విటమిన్ బి 12 లోపం తలెత్తకుండా చూసుకోవాలని లేదంటే తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: