తొక్కతో సహా ఉపయోగపడే ఆహారాలు ఏంటో తెలుసా..?

Divya
సాధారణంగా పండ్లను,కూరగాయలను తీసుకునేటప్పుడు,వాటి తొక్కలను తీసేసి మిగతా భాగాన్ని తీసుకుంటువుంటాము.కానీ కొన్ని రకాల ఆహారాలను తొక్కతో పాటు తీసుకుంటేనే వాటి నుంచి కలిగే పోషకాలు పుష్కలంగా లభిస్తాయని పోషకాహారనిపుణులు చెబుతూ ఉంటారు.అప్పుడే మన మనం తిన్న ఆహారం సరిగా జీర్ణమై,జీర్ణ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.అంతటి ప్రయోజనాలు కలిగిన ఆహారాలు ఏంటో,వాటి తొక్కల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
వంకాయలు..
వంకాయలను కర్రీలా చేసుకుని తినేటప్పుడు కొంతమంది వంకాయ పై తొక్కుని తీసేసి తింటూ ఉంటారు.కానీ అందులో కాల్షియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.దీనితో మన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసి,తిన్న ఆహారం సరిగా జీర్ణమయ్యేలా చేస్తుంది.మరియు ఇందులోని ఫైబర్ బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఆరెంజ్..
ఆరెంజ్ లను తినేటప్పుడు పైతొక్కను తీసేసి తినడం సర్వసాధారణం.ఆరంజ్ లను ఎక్కువగా తీసుకోవడం వల్ల,మన రోగనిరోధక శక్తి పెంచుకోవడమే కాక, ఇందులోని విటమిన్ సి మన ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.అంతేకాక దీనితొక్కలో కూడా ఫైబర్ విటమిన్ సి,విటమిన్ ఏ,మరియు యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.దీని తొక్కలను ఎండబెట్టి పౌడర్ లా చేసుకుని వంటకాల్లో కలిపి తీసుకోవడంతో,ఆ ప్రయోజనాలన్నీ మనం పొందవచ్చు.
కివి..
కివిని ప్రతి ఒకరు కచ్చితంగా తొక్క తీసేసి తింటూ ఉంటారు.కానీ కివిపండు యొక్క తొక్కలో విటమిన్ ఈ,పోలేట్లు,పైబర్ మరియు ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఈ పండును తొక్కతో పాటు తీసుకోవడం వల్ల,గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.మరియు కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా దరిచేరకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
స్వీట్ పొటాటో..
స్వీట్ పొటాటోను తొక్కతో పాటు తీసుకోవడం వల్ల,ఇందులో విటమిన్ ఈ ఫైబర్ గుణాలు పుష్కలంగా అందుతాయి.రేచీకటి మరియు కంటిచూపు మందగించడం వంటి సమస్యలతో బాధపడేవారు స్వీట్ పొటాటోలను తొక్కతో పాటు తీసుకోవడం చాలా ఉత్తమం.బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు.
నిమ్మతొక్క..
సాధారణంగా నిమ్మకాయను పిండి నిమ్మరసం మాత్రమే ఉపయోగిస్తాము.నిమ్మతొక్కలో పొటాషియం, క్యాల్షియం,విటమిన్ సి పుష్కలంగా అందుతాయి. కావున పైన చెప్పిన ఆహారాలన్నీ తొక్కతో పాటు తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: