ఇప్పుడు చెప్పే పొడిని తయారు చేసుకొని వాడడం వల్ల అధిక బరువు, షుగర్, రక్తపోటు ఇంకా అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి. ఇంకా ఇవే కాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, తిమ్మిర్లు, గౌట్, ఆర్థరైటిస్, వాత దోషాలు ఇంకా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వంటి 80 కు పైగా అనారోగ్య సమస్యలను ఈ పొడిని వాడడం వల్ల ఈజీగా నయం చేసుకోవచ్చు. ఈ పొడిని వాడడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులు కూడా ఈజీగా తొలగిపోతాయి. అలాగే మందులు వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాల బారిన పడకుండా ఉంటాము. ఈ పొడిని వాడడం ఇంకా అలాగే తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ పొడిని 15 రోజుల పాటు క్రమం తప్పకుండా వాడడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే దీనిని రెండు నెలల పాటు వాడడం వల్ల చాలా కాలంగా వేధిస్తున్న గౌట్ సమస్య కూడా తగ్గుతుంది.ఈ పొడికి మనం ఒక టీ స్పూన్ నల్ల జీలకర్రను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఈ నల్ల జీలకర్ర చాలా చేదుగా ఉంటుంది. దీనిని కేవలం ఔషధంగా మాత్రమే ఉపయోగించాలి. అధిక బరువు, షుగర్, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. దీనిని వాడడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు ఇంకా వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. వాత దోషాలను తగ్గించడంలో కూడా ఈ జీలకర్ర మనకు చాలా సహాయపడుతుంది. అలాగే మనం ఉపయోగించాల్సిన రెండో పదార్థం ఏంటంటే మెంతులు. వీటిని 5 టీ స్పూన్ల మోతాదులో వాడాల్సి ఉంటుంది. వాత దోషాలను తగ్గించడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో ఇంకా ఎముకలను ధృడంగా ఉంచడంలో, కీళ్ల నొప్పులను ఇంకా మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో మెంతులు మనకు చాలా ఉపయోగపడతాయి.
అలాగే మనం వాడాల్సిన మూడో పదార్థం వాము.దీనిని రెండు టీ స్పూన్ల మోతాదులో వాడాల్సి ఉంటుంది. షుగర్ ను అదుపులో ఉంచడంలో ఇంకా జీర్ణసమస్యలను తగ్గించడంలో వాము దివ్యౌషధంగా పని చేస్తుంది. అంతేకాకుండా దీనిని వాడటం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా తొలగిపోతుంది. వీటితో పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పొడిని తయారు చేసుకోవడానికి ముందుగా కళాయిలో మెంతులను వేసి వాటిని వేయించాలి. వీటిని చిన్న మంటపై దోరగా వేయించి ప్లేట్ లోనికి తీసుకోవాలి. ఆ తరువాత అదే కళాయిలో వాము వేసి వేయించాలి. అలాగే వామును కూడా వేయించిన తరువాత నల్ల జీలకర్రను వేసి చిన్న మంటపై వేయించి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తరువాత వీటిని ఒక జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.తరువాత ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి బాగా కలపాలి. ఇక ఇలా తయారు చేసుకున్న నీటిని రాత్రి భోజనం చేసిన గంట తరువాత టీ తాగినట్టు తాగాలి.