సమ్మర్లో ఖచ్చితంగా ఈ పండు తినండి?

Purushottham Vinay
ఇక ఈ సీజన్‌లో ఖచ్చితంగా మనం నేరేడు పండ్లను తినాలి. ఎందుకంటే వీటితో మనకు చాలా రకాల లాభాలు కలుగుతాయి. సాధారణంగా ఈ పండ్లు తీపి, వగరు ఇంకా పులుపు రుచులను కలిగి ఉంటాయి. ఇవి మనకు వేడి నుంచి చాలా సులభంగా ఉపశమనాన్ని అందిస్తాయి.అలాగే ఆకలిని కూడా పెంచుతాయి. మన శరీరంలో కలిగే పైత్యాన్ని కూడా సులభంగా తగ్గిస్తాయి. విరేచనాల సమస్యలు ఉన్నవారు నేరేడు పండ్లను ఖచ్చితంగా తినాలి.అప్పుడు శరీరంలో ఉన్న వేడి కూడా పోతుంది. ఇక ఈ పర్పుల్ కలర్‌ పండులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఐరన్, విటమిన్ సి, బి ఇంకా గ్లూకోజ్ వంటి చాలా పోషకాలు ఉన్నాయి.ఎండాకాలంలో నేరేడు ఖచ్చితంగా అధిక దాహాన్ని అరికడుతుంది. ఇంకా అంతేగాక కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా ఈ పండ్లు నివారిస్తాయి. కడుపులో ప్రమాదవశాస్తు వెళ్లిన తలవెంట్రుకలు ఇంకా లోహపు ముక్కలను కూడా కరిగిస్తాయి.ఇంకా అలాగే చిగుళ్ల వ్యాధులతో బాధపడేవారు ఈ చెట్టు బెరడు ఆకుల రసాన్ని నోట్లో వేసుకుని పుక్కలిస్తే వారికి చాలా మంచిది.


పుల్లలతో పళ్లు తోమితే చిగుళ్లు చాలా ఆరోగ్యాంగా ఉంటాయి.ఇంకా నోటి దుర్వాసనను నివారిస్తుంది. అలాగే మూత్రాశయ, నోటి, క్యాన్సర్‌కు కూడా ఇది టానిక్‌లా పనిచేస్తుంది.ఈ నేరేడు గింజల్ని దోరగా వేయించి దంచి పొడి చేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఈ పొడిని నీటిలో కలిపి కషాయం కాచి, అందులో పాలు ఇంకా తాటి కలకండ కలిపి కాఫీలాగా రెండు పూటలా తాగితే అతి మూత్రం అలాగే మధుమేహం అదుపులోకి వస్తాయి. సీజనల్‌లో నేరేడు పండ్లను రోజుకు కనీసం 10 పండ్లు తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచి మేలు జరుగుతుంది.ఇక రక్తంలో హిమోగ్లోబిన్ సమస్యతో బాధపడుతుంటే నేరేడు పండ్లు తినడం వల్ల బ్లడ్ లెవెల్ అనేది పెరుగుతుంది. దానికి కారణం ఈ పండులో ఉండే ఐరన్‌. రక్త శుద్ధిలో కూడా ఇది ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పండు జ్యూస్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది దగ్గు, గురకను కూడా ఈజీగా నియంత్రిస్తుంది. ఇంకా అలాగే ఇది శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: