కిడ్నీలను క్లీన్ గా చేసుకునే సూపర్ టిప్?

frame కిడ్నీలను క్లీన్ గా చేసుకునే సూపర్ టిప్?

Purushottham Vinay
మన కిడ్నీల్లో మలినాలు, విష పదార్థాలు పేరుకుపోకుండా వాటిని ఎల్లప్పుడూ చాలా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. మూత్రపిండాల్లో విష పదార్థాలు పేరుకుపోవడం వల్ల ఆ ప్రభావం మన చర్మం, జుట్టుతో పాటు ఇతర అవయవాల మీద కూడా ఖచ్చితంగా పడుతుంది.మూత్రపిండాల్లో విష పదార్థాలు పేరుకుపోవడంతో పాటు వీటికి సంబంధించిన ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే వారి సంఖ్య నేటి కాలంలో చాలా ఎక్కువవుతుంది. చెడు ఆహారపు అలవాట్లే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణం. జంక్ ఫుడ్ ఇంకా నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకునే వారిలో, మసాలాలు కలిగిన పదార్థాలను తీసుకునే వారిలో, ప్రాసెస్ట్ ఫుడ్ తీసుకునే వారిలో ఇంకా అలాగే చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకునే వారిలో మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకా అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకునే వారిలో, మద్యపానం చేసే వారిలో, ఇంకా అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు మందులను ఎక్కువగా వాడే వారిలో కూడా మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.



మూత్రపిండాలను శుభ్రపరచడంలో మనకు కార్న్ సిల్క్ బాగా ఉపయోగపడుతుంది.  మొక్కజొన్న కంకిలో ఉండే పీచుతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మూత్రపిండాలు శుభ్రపడడంతో పాటు మనం అనేక  ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు.ముందుగా మొక్కజొన్నలో పీచును తీసుకుని ఎండబెట్టాలి. ఆ తరువాత ఈ పీచును 50 గ్రాముల మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో 2 గ్లాసుల నీళ్లు పోసి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత దీనిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా నెలకు ఒకటి లేదా రెండు సార్లు తాగడం వల్ల మూత్రపిండాల్లో పేరుకుపోయిన మలినాలు తొలగిపోయి వాటి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే మూత్రపిండాలను డిటాక్సిఫికేషన్ చేయడంలో మనకు పుచ్చకాయ గింజలలు కూడా బాగా ఉపయోగపడతాయి. తాజాగా పుచ్చ గింజలను లేదా మార్కెట్ లో లభించే పుచ్చగింజలతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మూత్రపిండాలను బాగా శుభ్రపరుచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: