రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి డ్రై ఫ్రూట్స్ ని ఎలా తినాలో తెలుసా..!

Divya
రోగనిరోధకశక్తి అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఇమ్యూనిటీ పవర్ అధికంగా ఉండడం వల్ల మనల్ని అనేక రోగాలకు కారణమైన జేమ్స్ తో పోరాడి మన శరీరాన్ని కాపాడుతుంది.అలాంటి ఇమ్యూనిటీపవర్ ని పెంచుకోవడానికి,కొన్ని రకాల ఆహారాలు మనకి చాలాబాగా ఉపయోగపడతాయి. ఇందులో ముఖ్యంగా డ్రైఫ్రూట్స్. ఈ డ్రైఫ్రూట్స్ ను నానబెట్టుకుని తినడం వల్ల మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్, ఫైబ‌ర్, విట‌మిన్స్ పుష్క‌లంగా లభించడమే కాక ఇమ్యూనిటీపవర్ పెంచడంలో సహాయపడతాయి. ఏ డ్రైఫ్రూట్స్ ని నానబెట్టి తినడం వల్ల ఏ ఏ పుష్కాలు లభిస్తాయో ఇప్పుడు చూద్దాం..

బాదం..
రోజు అయిదారు బాదాములను రాత్రిపూట నానబెట్టి, పరగడుపున తినడం వల్ల మన శరీరానికి అధికంగా అవసరమై ఒమేగా త్రీ మరియు సిక్స్  ఫ్యాటీయాసిడ్స్, మాంగ‌నీస్, ఫోలేట్, ఐర‌న్, విట‌మిన్ డీ, ఈ, బీ 12 అధికంగా లభిస్తాయి. ఈ న్యూట్రియన్స్ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా,మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి.
జీడిపప్పు..
జీడిపప్పును నానబెట్టుకుని తినడం వల్ల, రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మరియు కొన్ని తిన్నా,ఎక్కువ తిన్న ఫీలింగ్ కలిగించి, వేరే ఆహారాలు మీద ధ్యాస వెళ్లకుండా చేస్తుంది.
కిస్ మిస్..
రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే నీటితో సహా తినడం వల్ల అందులోని పాలిఫినల్స్, విటమిన్ సి, పుష్కలంగా లభించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులోని ఐరన్ స్త్రీలలో కలిగే ఋతుక్రమణ సమస్యలను  తగ్గించడంలో సహాయం చేస్తుంది.
వాల్ న‌ట్స్..
వాల్ న‌ట్స్ నాన‌బెట్టి తిన‌డం వల్ల, ఇందులోని విటమిన్ ఇ మరియు ఒమేగా 3 యాసీడ్స్ ఒక నిరోధక శక్తిని పెంచడం కాక మెదడు కణాలు కణాలు సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. వీటితో అల్జీమర్స్ ని దూరం చేసుకోవచ్చు.
అంజూరాలు..
అంజూరాలను మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఇందులోని ఐరన్, విటమిన్ సి విటమిన్ ఈ  పుష్కలంగా లభిస్తాయి.వీటిని గర్భిణీస్త్రీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్యలు దూరం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: