దేవుడా... యాపిల్స్ ఎక్కువ తినడం కూడా చెడ్డేనా ?

VAMSI
మనము బ్రతికి ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండడానికి పెద్దలు కావొచ్చు, డాక్టర్స్ కావొచ్చు కొన్ని ఆహారపు అలవాట్లను చెబుతూ ఉంటారు. అలాంటి అలవాట్లలో ఒకటే రోజు వారీ మన ఆహారంలో ఖచ్చితంగా పండ్లు కూడా ఒక భాగం కావాలని, అందులోనూ యాపిల్ ఉండడం మరీ మంచిదని సలహా ఇస్తారు. ఈ ఆపిల్ లో అధిక ఫైబర్, విటమిన్ సి మరియు పొటాషియం లాంటి పోషక విలువలు ఉంటాయి. పైగా యాపిల్ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా కీలకంగా పనిచేస్తుంది. అందుకే నేటి రోజుల్లో చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకూ అందరూ యాపిల్ ను తినడం అలవాటు చేసుకున్నారు. ఇంకా యాపిల్ ను రోజుకు ఒకటి తీసుకునే డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరమే లేదు అని కూడా చెప్పేవారు.
కానీ తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం యాపిల్ ను ఎక్కువగా తినడం మూలాన కొన్ని నష్టాలు కూడా ఉన్నాయట. అయితే ఎంతో ఆరోగ్యకరం అయిన ఈ యాపిల్ ను తినడం వలన ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.
* యాపిల్స్ ను అధికంగా తీసుకోవడం వలన శరీర బరువు అమాంతం పెరిగిపోతోందట.
* ఇంకా ఈ యాపిల్ ను అపరిమితంగా తినడం కారణంగా మన జీర్ణక్రియ సక్రమంగా పనిచేయదట, జీర్ణక్రియ పనిచేయకపోతే ఎన్ని నష్టాలు వస్తాయో మీకు తెలిసిందే.
* యాపిల్ లో ఉండే ఫైబర్ వలన పొట్టకు సంబంధించిన జబ్బులు కూడా రావొచ్చట.
* ఇక ఒక రోజులో రెండు కన్నా ఎక్కువ యాపిల్స్ కనుక తిన్నట్లయితే మన దంతాలు దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయట.
* అన్నింటికంటే ముఖ్యమైంది యాపిల్ ను ఎక్కువగా తీసుకుంటే మన శరీరంలోని చక్కర స్థాయి పడిపోతాయట.
కాగా ఎప్పటినుండిదో పెద్దలు చెబుతున్న ఒక మాట ఏమిటంటే... అమృతం అయినా అధికంగా తీసుకుంటే విషం గా మారుతుంది అని, అదే విధంగా మన శరీరానికి యాపిల్ మంచిది అయినప్పటికీ... అధికంగా తీసుకోవడం వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: