బొప్పాయి ఆకుల రసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రసాన్ని తాగితే చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ముఖం చాలా కాంతివంతంగా మారుతుంది. మొటిమలు ఇంకా మచ్చలు కూడా ఈజీగా తగ్గుతాయి. అలాగే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా ఉంటాయి. కాబట్టి బొప్పాయి ఆకుల రసాన్ని ప్రతి రోజూ కూడా తీసుకోవాలి. అయితే ఈ రసం ఎక్కువ తాగితే వాంతులు, విరేచనాలు సంభవిస్తాయి. కాబట్టి వైద్యుల సలహా ప్రకారం ఈ రసాన్ని తీసుకోవడం ఉత్తమం. లేదంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల జ్వరం కూడా ఈజీగా తగ్గుతుంది. అలాగే అలసట, తలనొప్పి, వికారం, చర్మంపై దద్దుర్లు, దురదలు ఇంకా వాంతులు వంటి సమస్యల నుంచి ఈజీగా బయట పడవచ్చు. ఈ ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. షుగర్ సమస్య నుంచి క్రమంగా బయట పడవచ్చు. ఇంకా ఈ ఆకుల రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసేలా పాంక్రియాస్‌ను ప్రోత్సహిస్తాయి. కాబట్టి షుగర్ లెవల్స్ ఈజీగా తగ్గుతాయి. ఇక ఈ ఆకుల రసాన్ని తీసుకుంటే గ్యాస్ ఇంకా కడుపులో మంట వంటి సమస్యల నుంచి ఈజీగా బయట పడవచ్చు.
జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా బాగా మెరుగు పడుతుంది. మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. వాపుల నుంచి కూడా ఈజీగా బయట పడవచ్చు.అలాగే కీళ్ల నొప్పులు కూడా ఈజీగా తగ్గుతాయి.ఈ రసాన్ని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధులు ఎప్పటికీ రావు. అలాగే విష జ్వరాలు రాకుండా కూడా ఈజీగా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా ప్లేట్ లెట్ల సంఖ్య కూడా ఎక్కువ పెరుగుతుంది. అందుకే డెంగ్యూ వచ్చిన వారికి బొప్పాయి ఆకుల రసం తాగాలని డాక్టర్ లు సూచిస్తుంటారు. ఇక ఈ రసం తాగితే పపైన్ ఇంకా కైమోపపైన్ అనే ఎంజైమ్ లు మన శరీరానికి లభిస్తాయి. దీని వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం ఇంకా అలాగే ఇతర జీర్ణ సమస్యల నుంచి ఈజీగా బయట పడవచ్చు. ఈ ఆకుల రసంలో ఉండే ఆల్కలాయిడ్ సమ్మేళనాలు చుండ్రును ఈజీగా అరికడతాయి. ఇంకా బట్టతల కాకుండా కూడా నివారిస్తాయి. జుట్టు కూడా బాగా పెరిగేలా చేస్తాయి. ఈ ఆకుల రసంలో విటమిన్లు ఎ, సి, ఇ, కె, బి లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మనకు సంపూర్ణ పోషణ లభిస్తుంది. దీంతో చాలా ఆరోగ్యంగా ఉంటారు.