
ఉదయాన్నే అల్పాహారంగా పెసర మొలకలు తింటే ఏమవుతుందో తెలుసా..?
1).ఇందులోని కె, సి విటమిన్లు..
రక్తం గడ్డకట్టడానికి విటమిన్ కె చాలా అవసరం. అంతేకాక బోన్ డెన్సిటీని పెంచుతుంది. వీటిని తరుచుగా తీసుకోవడం వల్ల, శరీరానికి కావాల్సిన విటమిన్ సి పుష్కళంగా అంది, డిసీజెస్ కలిగించే సూక్ష్మ క్రిములతో పోరాటానికి కావాల్సిన రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
2).ప్రోటీన్..
ఇందులో గ్లోబులిన్, అల్బుమిన్ అనే ప్రధాన ప్రోటీన్లు ఉండడం వల్ల, కండరాలు దృఢపడతాయి. మెదడు కణజాలం వృద్ధికి,చర్మం,రక్తకణజాలాన్ని పెంపోదించడానికి కావాల్సిన ప్రోటీన్లను ఈ మొలకలు ద్వారా పొందవచ్చు.
3).రక్త ప్రసరణకు..
వీటిలోని ఐరన్, కాపర్ అనే మినరల్స్ రక్తకణాలను వృద్ధి చేసి, రక్తప్రసరణ సజావుగా జరిగేందుకు సహాయపడతాయి. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి.
4).జీర్ణక్రియకు..
ఇందులో ఉన్న అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి దోహదపడుతుంది.అంతేకాక ఇందులో ఉండే తక్కువ కేలరీలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇవి కొంచెం తిన్నా ఎక్కువ తిన్న ఫీలింగ్ ని కలిగించి, తక్కువ మొత్తంలో తీసుకునేలా చేస్తాయి.అంతే కాక ఆకలిని కలిగించే గ్రెలిన్ హార్మోన్ విడుదలను కంట్రోల్ చేస్తుంది.
విటమిన్ B9: ప్రతిరోజూ పెసర మొలకలు తీసుకుంటే మన శరీరానికి అవసరమైన ఫోలేట్ (B9) 100% అందుతుంది. ఇది హార్మోన్ల సమతుల్యతను మరియు పునరుత్పత్తిని క్రమంబద్దికరిస్తాయి. మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో ఫోలేట్ తీసుకోవడం చాలా అవసరం.కావున ఉదయాన్నే అల్పాహారంగా పెసర మొలకలు తీసుకోవడం మహిళలకు చాలా ఉపయోగకరం.