జ్వరం లేకపోయినా.. పిల్లల తల ఎందుకు వేడిగా ఉంటుందో తెలుసా?
ఇలా జరిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. ఒకవేళ శిశువు నిద్రించే గది వేడిగా ఉన్నట్లయితే శిశువుతల శరీరంలోని మిగిలిన భాగాల కంటే కాస్త వేడిగా ఉంటుంది. ఒకవేళ శిశువుకు వాతావరణానికి అనుగుణంగా దుస్తులు ధరించకపోతే తల వెచ్చగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. చల్లని వాతావరణం లో శిశువుకి టోపీ పెట్టడం వల్ల ఇక మిగతా భాగాలతో పోల్చి చూస్తే తల కాస్త వెచ్చగానే ఉంటుందట లేదా వాతావరణ వేడిగా ఉన్నప్పుడు లేదా సూర్యకాంతి కి వెళ్ళినప్పుడు.. శిశువు వెనుక భాగంలో ఎక్కువసేపు పడుకుంటే జ్వరం లేకపోయినా తల వెచ్చగానే ఉంటుందట.
వాతావరణం వేడిగా లేదా పొడిగా ఉంటే శిశువుకు వదులుగా ఉండే దుస్తులు ధరించడం మేలు అని నిపుణులు చెబుతున్నారు. వేడి చేసే దుస్తులు ధరించడం ఆపేయాలట. ఎక్కువగా వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించడం వల్ల శిశువులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడదట. ఎప్పుడు శిశువు గది ఉష్ణోగ్రతను కూడా సాధారణంగా ఉంచాలట. ఒకవేళ తల నుదురు చాలా రోజులుగా వేడిగా అనిపిస్తే మాత్రం వైద్యుడుని సంప్రదించటం మేలు అని కూడా సూచిస్తున్నారు నిపుణులు. మూడు నెలల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయట.