లివర్ : ఈ సంకేతాలు కనిపిస్తే పాడైపోయినట్లే?

Purushottham Vinay
లివర్ అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ఇది మన శరీరంలో ఉండే మురికిని శుభ్రపరచడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. దాని సహాయంతో మీరు అనేక వ్యాధులను చాలా ఈజీగా నయం చేయవచ్చు.కాలేయం సరిగ్గా పనిచేయడం మానేస్తే, మీరు చాలా తీవ్రమైన సమస్యలను ఈజీగా ఎదుర్కొంటారు.అందుకే లివర్ ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో మీకు కాలేయానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, ఈ పరిస్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించండి. కాలేయం దెబ్బతినడాన్ని సూచించే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాల గురించి తెలుసుకుందాం.లివర్ లో మంట కారణంగా కడుపు పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. ఊబకాయం వల్ల పొట్ట పెరగడం అనే సమస్యను చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. మీరు కూడా ఇలాంటి తప్పు చేస్తే అప్రమత్తంగా ఉండండి. కాలేయంలో మంటను నివారించేందుకు సకాలంలో చికిత్స చేసుకోకుంటే లివర్‌ పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉంది. 


అందుకే కాలేయంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మేలు.అలాగే కాలేయం దెబ్బతినడం లేదా సమస్య తలెత్తితే మీకు చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఇది కాకుండా చర్మంపై పొడిబారడం కళ్ల చుట్టూ నల్లటి వలయాలు కూడా కాలేయ వైఫల్యం లక్షణాలు కావచ్చు. మీ కాలేయం బలహీనంగా ఉన్నప్పుడు మీ చర్మ కణాలు దెబ్బతింటాయి.అలాగే జుట్టు రాలడం కూడా మొదలవుతుంది.ఇంకా అలాగే కాలేయం దెబ్బతినడం వల్ల మూత్రం రంగులో మార్పులు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా మీ మూత్రం రంగు చాలా పసుపు రంగులో కనిపిస్తే లేదా కళ్ల చుట్టూ పసుపు రంగులో ఉంటే, అది కాలేయం దెబ్బతినే లక్షణం కావచ్చు. ఈ పరిస్థితిలో వెంటనే వైద్య సలహా తీసుకోండి.కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండండి. లివర్ కి హాని చేసే పదార్ధాలు తీసుకోవద్దు. ఏమైన సంకేతాలు కనిపిస్తే డాక్టర్ ని సంప్రదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: