ఈ సంకేతాలు మీ శరీరంలో కనిపిస్తున్నాయా.. డేంజర్ లో ఉన్నట్టే..!!

Divya
ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఎంతోమంది పలు రకాల వ్యాధులతో చాలా సతమతమవుతూ ఉన్నారు. ముఖ్యంగా అతి చిన్న వయసులోనే గుండెకు సంబంధించిన వ్యాధులతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ వస్తోంది. అయితే ఈ వ్యాధి రావడానికి పలు కారణాలు ఉండవచ్చు.. అంతేకాకుండా ఒత్తిడి సమస్యలు, సరైన ఆహారం ,సరైన నిద్ర లేకపోవడం వంటి వాటి వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనంలో తెలియజేయడం జరిగింది. ఇలాంటి కారణాల వల్ల మన గుండెలో ఉన్న నాలుగు గదులలో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణకి  అడ్డుపడడం వల్ల గుండెపోటు సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇలాంటి సమయంలో మన శరీరంలో పలుమార్పులు చోటు చేసుకుంటున్నాయని వైద్యులు తెలియజేస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఛాతీ లో నొప్పి లేదా ఇబ్బంది కలిగినప్పుడు గుండెపోటు సమస్య రాబోతున్న లక్షణాలలో ఇది కూడా ఒకటి.. ఎవరికైనా ఛాతిలో నొప్పి లేదా అధిక నొప్పి వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యులని సంప్రదించాలి. హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ మొదలైనప్పుడు ఇలా ఛాతీ  లో ఇబ్బంది కలుగుతుందట. ఇక అంతే కాకుండా ఎక్కువగా చమట రావడం, ఊపిరి ఆడక పోవడం, వికారం వంటి లక్షణాలు కూడా గుండెపోటు సమస్య అనేందుకు కారణాలని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా పొత్తి కడుపుతో ఇబ్బంది .. పొత్తికడుపులో నొప్పి వంటి సంకేతాలు కూడా గుండెపోటుకు సంకేతం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మనం వైద్యున్ని సంప్రదించాలి.

ముఖ్యంగా మన శరీరంలో ఎక్కడైనా సరే రక్తం గడ్డ కట్టడం వలన హార్ట్ ఎటాక్ వస్తుంది.. గుండె కండరాలకు సర్కులేషన్స్ చేయలేనందువల్ల ఛాతిలో నొప్పి ప్రారంభమై మెడ వరకు అది ఎక్కువగా వ్యాపిస్తుంది. అలా కండరాలు బిగుసుకుపోయి మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుచేతనే అలాంటి సమయంలో ఖచ్చితంగా వైద్యుల సలహాలు తీసుకోవాలి.

ఎవరైనా ప్రతిసారి స్పృహ తప్పి పడిపోవడం.. గుండె రక్తం పంపిణీ ఆగిపోవడం ఆక్సిజన్ సరఫరా చేయలేకపోవడం వల్ల గుండె కండరాలు ఇబ్బంది పడి గుండె స్లోగా కొట్టుకోవడం లేదంటే వేగంగా కొట్టుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలు ఎవరికైనా వచ్చినప్పుడు వెంటనే వారు వైద్యుల దగ్గరికి వెళ్లి సూచనలు సలహాలను తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: