ఆవాలు: ఆరోగ్యానికి లాభాలే లాభాలు?

Purushottham Vinay
ఇక చాలా చిన్నగా ఉండి వంటింటిలో రెగ్యులర్ గా వాడే ఈ గింజలు మనకు ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి.మనలో చాలా మంది కూడా ఆవాలను వాడతారు.కానీ వాటిల్లో ఉన్న ప్రయోజనాలు అయితే తెలియవు. కొంతమంది తాళింపులో వేసిన ఆవాలను ఎక్కువగా ఏరి పాడేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పే ప్రయోజనాలు తెలిస్తే తప్పనిసరిగా వాటిని తినటం అలవాటు చేసుకుంటారు.ఇక ఆంధ్ర అంటే 'ఆవకాయ' కు పెట్టింది పేరు. ఇంకా అలాగే ఆవకాయలో కూడా ఆవపిండిదే పెద్దపీట. అంతేకాదు రోజువారీ కూర తాలింపులో కూడా ఆవాలు తప్పనిసరే. ఇవి పరిమాణంలో ఎంత చిన్నగా ఉంటాయో అంత ఔషధీయ గుణాలున్న దినుసులు.అందుకే నిత్యం కూడా వీటిని తాలింపులో వాడతాం.ఆవాల్లో ఫైటో న్యూట్రియెంట్స్‌, విటమిన్స్‌, ఖనిజ లవణాలు ఇంకా అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అలాగే ఇందులో విటమిన్‌ బి3 కూడా ఉంటుంది.ఇక ప్రతిరోజు కూడా ఆహారంలో తీసుకోవడంవల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. పంటినొప్పి కలిగినపుడు గోరువెచ్చటి నీటిలో ఆవ పొడి వేసి, తరువాత పుక్కిలి పడితే నొప్పి తగ్గుతుంది.


ఇంకా అలాగే జుట్టుకు ఆవనూనె రాసుకుంటే పేలు, మాడు మీద కురుపులు ఇంకా అలాగే దురదలు కూడా తగ్గుతాయి. ఆవాల పొడిని తేనేతో కలిపి తీసుకుంటే అస్థమా ఇంకా ఉబ్బస వ్యాధి లాంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.ఇంకా అలాగే పులిపిరి కాయల మీద ఆవాలు నూరిన ముద్దతో పట్టు వేస్తే పులిపిరులు ఎండి అవి రాలిపోతాయి. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఆవాల ముద్దలో కర్పూరము కలిపి ఆ ప్రాంతంలో రాయటం వల్ల భాధ ఈజీగా తగ్గుతుంది. ఆవాలలో ఉండే సెలీనియం ఇంకా మెగ్నీషియం అనే రసాయనాల వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది శరీరంలో వ్యర్థాలను బయటకు పంపి, కొవ్వును తగ్గించే గుణం ఆవాలకి ఉంది.ఆవాల ముద్ద వేడినీళ్లలో వేసి స్నానం చేస్తే ఒంటినొప్పులు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: