ఈ డ్రింక్ తాగితే శరీరానికి శక్తి వస్తుంది!

Purushottham Vinay

ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, శరీరానికి శ్రమ లేకపోవడం, మద్యపానం ఇంకా హార్మోన్ల అసమతుల్యత వంటి రకరకాల కారణాల వల్ల ప్రస్తుత రోజుల్లో కోట్లాది మంది అధిక బరువు సమస్యతో చాలా తీవ్రంగా మదన పడుతున్నారు.విపరీతంగా బరువు పెరగడం వల్ల శరీర ఆకృతి అసహ్యంగా మారమే కాదు గుండె పోటు, మధుమేమం ఇంకా అలాగే క్యాన్సర్ వంటి ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే పెరిగిన బరువు తగ్గించుకోవడం కోసం అనేక రకాల విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్ ను కనుక తీసుకుంటే బరువు తగ్గడమే కాదు శరీరానికి అవసరం అయ్యే శక్తి కూడా ఈజీగా లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సూపర్ డ్రింక్ ఏంటో ఇంకా దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ లో ఆరు నల్ల ఎండు ద్రాక్షలు ఇంకా రెండు వాల్ నట్స్‌, రెండు ఎండిన అత్తిపండ్లు అలాగే ఒక కప్పు వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.

ఇక ఉదయాన్నే బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న వాల్ నట్స్‌, అత్తిపండ్లు ఇంకా నల్ల ఎండు ద్రాక్షలను వాటర్ సహా వేసుకోవాలి.అలాగే ఒక కప్పు బాదం పాలు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు ఇంకా అలాగే చిటికెడు కుంకుమ పువ్వును వేసుకుని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ అనేది సిద్ధమవుతుంది.ఇంకా అలాగే బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ డ్రింక్‌ను తీసుకుంటే అతి ఆకలి అనేది దూరం అవుతుంది. ఇంకా ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది. అలాగే మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. దాంతో వేగంగా బరువు తగ్గుతారు. ఇంకా అలాగే పైన చెప్పిన సూపర్ డ్రింక్‌ను మీ డైట్‌లో కనుక చేర్చుకుంటే శరీరానికి అవసరం అయ్యే శక్తి కూడా లభిస్తుంది. నీరసం ఇంకా అలసట వంటివి కూడా దూరం అవుతాయి. అలాగే గుండె ఆరోగ్య వంతంగా మారుతుంది. ఇంకా బ్రెయిన్ కూడా షార్ప్‌గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: