తొలకరి జల్లుల్లో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..!!
తప్పకుండా మన ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏమిటి అంటే ముందుగా మొక్కజొన్న.. కేవలం చిరుతిండిగా మాత్రమే దీనిని పరిగణిస్తారు కానీ మొక్కజొన్న లో దొరికే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. మొక్కజొన్న ను తీసుకుంటే ఇన్ఫెక్షన్లు, డయేరియా వంటి రోగాలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచడానికి మొక్కజొన్న సహాయపడుతుంది.
బీట్ రూట్:
దుంప జాతి ద్వారా లభించే బీట్రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా వర్షాకాలంలో బీట్రూట్ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. రక్తహీనత సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ శరీరం నుండి బయటకు వెళ్ళిపోతుంది. కాలేయం శుభ్రపడి , కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలు కూడా బయటకు వెళ్ళిపోతాయి.