అటుకుల వల్ల లాభాలు ఎన్నో తెలుసా..?

Divya
ప్రజలకు ఆరోగ్యంపట్ల తినే ఆహారం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉండాలి.. ముఖ్యంగా కరోనా తర్వాత రోగనిరోధక శక్తి పెంచడంపై ప్రతి ఒక్కరు ఎక్కువ దృష్టి పెడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రతిరోజు ఉదయం తినే అల్పాహారంలో కూడా చాలా భిన్నంగా ఆరోగ్యాన్ని కాపాడే ఎటువంటి ఆహారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎక్కువగా రుచికరమైన పోషకాలు ఉండే ఆహారాన్ని తినడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత దేశంలో ఎక్కువ ప్రాంతాలలో అల్పాహారంగా "అటుకులను"తింటూ ఉన్నారట. ఈ అటుకులను దేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో వీటిని టిఫిన్ గా కూడా తింటూ ఉంటారు.
కొంతమంది మాత్రం అన్నం తినడానికి ఇష్టపడకుండా వీటినే తింటూ ఉంటారట. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం అటుకులు తినడమే మంచిది అని తెలియజేశారు. అందుచేతనే రైస్ బదులుగా పోషకాహార మైన ఇలాంటి అటుకులు తినడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. వీటి వల్ల పొందగలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1). అటుకుల లో గొప్ప లక్షణం ఏమిటంటే.. అటుకులు కిన్వ  ప్రక్రియ ద్వారా తయారు చేయబడతాయి. ఇందులో గ్లూకోజ్ కాని కొవ్వు పదార్థాలు గానీ అస్సలు ఉండవు కేవలం పిండి పదార్థాలు విటమిన్లు, ప్రొటీన్లు మాత్రమే అధికంగా ఉంటాయి.
2). ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల తొందరగా జీర్ణం అవుతూ ఉంటుంది.
3). అటుకుల లో ఇనుము చాలా అధికంగా ఉంటుంది అందుచేతనే గర్భిణీ స్త్రీలు వీటిని ఎక్కువగా తినమని వైద్యుల సలహా ఇస్తూ ఉంటారు. అటుకుల నిమ్మరసాన్ని జతచేసి తినడం వల్ల విటమిన్ సి కూడా లభిస్తుంది.
4). శరీరంలో ఉండే రక్తంలో  చక్కెర స్థాయిని ఇవి నియంత్రించడానికి బాగా సహాయపడుతాయి. డయాబెటిస్ రోగులకు ఇవి చాలా ఉపయోగకరం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: