
వేసవిలో చెమట వాసన వేధిస్తుందా.. ఇలా చేయండి?
సాధారణంగా ఏదైనా పని చేసినప్పుడు ప్రతి ఒక్కరికి చెమట పట్టడం కామన్. కొంతమందికి ఎక్కువగా మరికొంతమందికి తక్కువగా చెమట పడుతుంటుంది. ఇలా చెమట పట్టడం కూడా ఆరోగ్యకరమే. కాని కొంతమందిలో మాత్రం చెమట తో పాటు దుర్వాసన కూడా వస్తుంది. ఇక చెమటవాసన వదిలించుకోవడానికి నీటిలో డేటాల్, రోజ్ వాటర్ ఏదైనా ఒకటి కొన్ని చుక్కలు కలుపుకుని స్నానం చేస్తే మంచిది. బాడీ స్ప్రే పర్ఫ్యూమ్ కూడా వాడుకుంటే ఉపయోగం ఉంటుంది. ఎక్కువగా చెమట పడితే ఆ చోట బేబీ పౌడర్ చల్లుకుంటే వాసన రాదు. చెమట వాసన నుండి తప్పించుకోవడానికి ఎండలు తగ్గేంతవరకు కాటన్ దుస్తులు మాత్రమే వేసుకుంటే బెటర్. సింథటిక్ దుస్తులు మరింత చెమట వచ్చేలా చేస్తూ ఉంటాయి.
అంతేకాదండోయ్ ప్రతిరోజు దుస్తులను మార్చుకోవాలి.. లేదంటే చెమట వాసన మరింత ఎక్కువ అవుతూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. చెమట కారణంగా శరీరం నుంచి జింక్ లవణం లాంటివి పోతూ ఉంటుంది. దీన్ని భర్తీ చేయడం కోసం బీన్స్ క్యారెట్ బఠాని లాంటివి ఆహారంలో తీసుకోవాలి. ఇక సోంపు తినడం వల్ల నోటి దుర్వాసన నుంచి కాదు శరీర దుర్వాసన కూడా దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో ఎక్కువగా చెమట వాసన రాకుండా తప్పించుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు..