పేలు సమస్యతో చాలా మంది కూడా తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. జుట్టులో పేలు ఉన్న వారు ఎక్కడ పడితే అక్కడే తలను గోకడం వంటివి చేస్తూ చూసే వారికి తెగ చిరాకు తెప్పిస్తారు.ఇక వారు తీవ్ర అవస్థలు పడుతూ… ఎవరికీ చెప్పుకోలేని బాధను అనుభవిస్తుంటారు. అయితే ఈ పేలకు చిన్నా, పెద్దా, ఆడ ఇంకా మగా అనే తేడా లేదు. ఒకరి నుంచి ఒకరికి కూడా పేలు బాగా ఎక్కుతుంటాయి. అయితే దీన్ని తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాలు షాంపూలను వాడతారు. పేలు చనిపోయే మందును కూడా వాడుతుంటారు. మరి కొంతమంది అయితే కిరోసిన్ వంటివి కూడా తలకు రాసుకుంటూ ఆ పేలు కొరుకుతుంటే భరించలేక ఏదైనా చేసేస్తుంటారు. కానీ వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం అసలు ఉండదు.కానీ ఈ చిట్కాల ద్వారా తలలో ఉన్న పేలని వెంటనే చంపేయొచ్చు. అయితే అవేంటో మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం. తలకి నూనె పెట్టి పేలు మొత్తం పోయేలాగా దువ్వుకోవాలి. ఇలా చేయడం వలన తలలో పేలు మొత్తం వెంటనే పోతాయి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల తలలో పేలు చాలా వరకు ఈజీగా తగ్గుతాయి.
ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఒకే సారి చేయాలి.ఎందుకంటే ఒక్కొక్కరు ఒక సారి చేయడం వల్ల ఒకరికి తగ్గినా ఇంకొకరి తలలో పేలు మళ్లీ వీళ్లకు వస్తాయి.ఇక మరో పరిష్కారం ఏంటంటే మెడికల్ లో ఇవెర్మెక్టిన్ అనే టాబ్లెట్ ఉంటుంది. ఈ టాబ్లెట్ ఒకటి వేసుకుంటే చాలు తలలో పేలు మొత్తం దెబ్బకు చచ్చిపోతాయి.ఈ టాబ్లెట్ రాత్రి ఒకటి వేసుకుని పడుకుంటే చాలు దెబ్బకి ఉదయానికి పేలు మొత్తం కదలలేని స్థితిలోకి వస్తాయి.పొద్దున్నే దువ్వడం వలన పేలు మొత్తం పడిపోతాయి. ఇలా రెండు మూడు వారాల పాటు పేలు తగ్గే వరకు వారానికి ఒకసారి టాబ్లెట్ వేసుకోవడం వలన పేల సమస్య ఈజీగా తగ్గుతుంది. అలాగే పెర్లెస్ అని లోషన్ కూడా ఉంటుంది. ఈ లోషన్ ని అప్లై చేసి అలా వదిలేసి ఆ తర్వాత మీరు తలస్నానం చేయాలి. తల స్నానం చేసిన తర్వాత తడి తడి తలను దువ్వడం వలన పేలు మొత్తం కూడా వెంటనే పడిపోతాయి. ఇలా వారానికి ఒకసారి చేయడం వలన పేలు మొత్తం ఈజీగా తగ్గిపోతాయి.