దంచికొడుతున్న ఎండలు.. రోజంతా హుషారుగా ఉండాలంటే?

praveen
వేసవి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి పెరిగి పోతూ ఉంటుంది. ఎందుకంటే దంచికొడుతున్న ఎండలతో  ఒకవైపు ఉక్కపోత మరోవైపు వేడితో అందరూ తెగ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంతే కాదు కాస్త బయటికి వెళ్లారు అంటే చాలు ఎండ ప్రతాపానికి ఎనర్జీ మొత్తం పోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ఎండాకాలంలో చురుకుగా ఉండటానికి కనిపించిన పానీయాలు తాగుతూ ఉంటారు. చెరుకు రసం జ్యూస్ ను తాగడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం కాదు. అయితే ఎండాకాలంలో కూడా ఎనర్జీ లాస్ అవ్వకుండా ఎంతో హుషారుగా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది అని చెబుతూ ఉన్నారు నిపుణులు.

 మరి ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో  ఎనర్జీ పోయి నీరసపడి పోకుండా ఎంతో చురుకుగా చలాకీగా ఉండడానికి తీసుకోవలసిన కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది ఎండాకాలంలో ఆహారం తీసుకోవడానికి  కూడా ఆసక్తి చూపరు. అయితే సమయానికి  ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా ఎంతో హుషారుగా ఉండే అవకాశం ఉంటుందని.. అంతేకాకుండా రోజుకి కనీసం పది గ్లాసుల నీళ్లు తాగాలి అని సూచిస్తున్నారు నిపుణులు. ఇక గ్లాసులో గోరువెచ్చని నీరు తీసుకుని చెంచా నిమ్మరసం ఒక చెంచా అల్లం రసం రెండు చెంచాల తేనె కలిపి తాగితే వెంటనే  నీరసం  నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తూ  ఉన్నారు.

 అంతేకాకుండా ఒక గ్లాసు పల్చని మజ్జిగలో చెంచ పుదీనా రసం చెంచా నిమ్మరసం కలిపి అందులో చిటికెడు ఉప్పు వేసి తాగితే నీరసంతో కళ్లు తిరగడం తగ్గి కాస్త శక్తి వస్తుందట. ఒక గ్లాసు నల్ల ద్రాక్ష రసం తాగినా కూడా ఎంతో ఉపశమనం ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండేలా ప్రతి రోజు ప్లాన్ చేసుకోవాలి అంటు సూచిస్తున్నారు. ఒకవేళ బయటకు వెళ్ళిన ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు పలురకాల జాగ్రత్తలు పాటించాలి అంటూ చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: