"హై - బీపీ"తో బాధపడుతున్నారా... రోజూ ఈ పండు తినండి ?
అరటిపండులో ఉండే స్టార్చ్ అనే మూలకం మన జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయడానికి అవసరమైన బ్యాక్టీరియాను చేకూరుస్తుంది. అంతే కాకుండా అరటిపండు లోని కాల్షియం వలన ఎముకలు కూడా దృఢంగాను, ఆరోగ్యంగానూ ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్నవారు అరటిపండు తినడం చాలా మంచిది అని చెబుతున్నారు వైద్య నిపుణులు. కాగా వేసవి కాలంలో తక్షణ శక్తిని ఇచ్చే అమృతవనిగా కూడా అరటిపండును చెబుతుంటారు. మరే పండు కూడా తినిన వెంటనే కడుపు నిండిన భావన కానీ, శక్తి వచ్చిన భావనను కానీ అందించదు. అదే అరటిపండు అయితే వెంటనే కడుపు నిండి కాస్త బలం వస్తుంది.
కొంతమంది అయితే అరటిపండ్లను రోజు తింటుంటారు, అయితే మరికొందరు మాత్రం అరటిపండు తినడం వలన బరువు పెరిగిపోతాము అని అసలు దాని జోలికే వెళ్ళరు. అరటి పండు రోజు తినడం మంచిదే...కానీ బరువు పెరగకుండా సమన్వయం చేయాలి అంటే పొద్దున బ్రేక్ ఫాస్ట్ మానేసి.. అరటిపండు తినడం ఉత్తమం. ఇక అరటి పండు బిపిని కంట్రోల్ చేయడంలో మెరుగ్గా పని చేస్తుంది. ఇది మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే పదార్ధం వలన మానవ శరీరంలో సెరోటోనిన్ తయారు అవడానికి సహకరిస్తుంది. సెరోటోనిన్‌ని హ్యాపీ హార్మోన్ అని కూడా పిలుస్తుంటారు. దీని వలన మనలో ఒత్తిడి తగ్గుతుంది. అందువలన బిపి తో బాధపడేవారు అరటి పండు తినడం మంచిదే అంటున్నారు నిపుణులు.