థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే వీటిని ఒక సారి ట్రై చేయండి..!!

frame థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే వీటిని ఒక సారి ట్రై చేయండి..!!

Divya
హార్మోన్ల అసమతుల్యత కారణంగా థైరాయిడ్ సమస్య అనేది వస్తూ ఉంటుంది.. దీనికి హార్మోన్ పునస్థాపన చికిత్స చేయవలసి ఉంటుంది.. అయితే మందుల వాడకం ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. ఇక టాబ్లెట్లు ఎక్కువగా వాడడం వల్ల ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే సహజ నివారణలు పాటించడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. జీవనశైలిని సక్రమంగా ఉంచుకోవడంతో పాటు.. ఆరోగ్యానికి కూడా అవసరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు తెలియజేస్తున్నారు వాటి గురించి చూద్దాం.

1). కొన్ని విటమిన్ టాబ్లెట్స్ దశలవారీగా ఉపయోగించడం వల్ల థైరాయిడ్ సమస్య అనేది పెరుగుతుందట. ఇక ఇలాంటి సమయంలో విటమిన్ బి-12 తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట.

2). గ్లూటెన్ చిన్న ప్రేగులలో ఉండే రోగనిరోధక చర్యను కదిలిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇది సెలియక్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. హైపోథైరాయిడిజం, థైరాయిడ్టిస్ ఉన్నవారు తమ డైట్ లో గోధుమలను, ఇతర గ్లూటెన్ కలిగిన ఆహార పదార్థాలను తొలగించుకోవడం చాలా మేలట.

3). ప్రోబాయోటేక్ మాత్ర లో ఉండే బ్యాక్టీరియా మన కడుపులో ప్రేగులు ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుందట. వీటిని సహజమైన పద్ధతిలోనే తీసుకోవచ్చు. అది ఎలాగంటే పులియబెట్టిన ఆహారాలు, పానీయాలు, కొన్ని చీజ్ లు, పెరుగు వంటివి ప్రయోజనకరమైనవట.


4). చక్కెరతో చేసిన ఏవైనా ఆహార పదార్థాలు మన శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. దీని వల్ల థైరాయిడ్ హార్మోన్.. ట్రైయోడో థైరోనిక్ మారి ఇ సమస్యను మరింత ఎక్కువగా చేస్తుంది. అందుచేత చక్కెర పదార్థాల ను చాలా తక్కువగా తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక అంతే కాకుండా చర్మ సమస్యల నుండి కూడా విముక్తి పొందవచ్చు అని తెలియజేశారు.

ఈ చిట్కాలు కేవలం ఈ సమస్యను పూర్తిగా తగ్గిస్తాయని చెప్పలేము. కేవలం నిపుణుల సలహా మేరకు తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: