
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నిజంగా పెళ్లి చేసుకుంటాడా .. అసలు మేటర్ ఇదే..?
అయితే గడిచిన దశాబ్ద కాలంగా ఇలాంటి వార్తలు పుకార్లు బయటికి వస్తూనే ఉన్నాయి .. ప్రభాస్ మాత్రం వాటి గురించి స్పందించడం కూడా మానేశాడు .. అయితే ఇప్పుడు ప్రధాన మీడియా నుంచి ఈ వార్తలు రావడం తో .. ఆయన టీం స్పందించింది .. అవన్నీ పుకారులే ఫేక్ వార్తలని కొట్టి పారేశారు . ఒకప్పుడు ప్రభాస్ , అనుష్క జంట పై జోరుగా ఇలాంటి వార్తలు పుకార్లు వచ్చాయి .. ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారనే వరకు అంతా ప్రచారం వెళ్ళింది .
అయితే తాముఇద్దరం జస్ట్ స్నేహితులం మాత్రమే అంటూ ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు . అదే విధంగా గత సంవత్సరం భీమవరం కు చెందిన ఓ అమ్మాయి తో ప్రభాస్ పెళ్ళంటూ వార్తలు వచ్చాయి .. అంతకుముందు ఓ ఎంపీ కూతురితో పెళ్ళంటూ మరో గాసిప్ వచ్చింది .. ఇక మధ్యలో బాలీవుడ్ హీరోయిన్ పేరు కూడా గట్టిగా వినిపించింది . ఇలా ఎప్పటికప్పుడు ప్రభాస్ పెళ్లి పై ఊహాగానాలు వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ .. 45 సంవత్సరాల ప్రభాస్ మాత్రం వాటిని పట్టించుకోకుండా తన సినిమాల తో దూసుకుపోతున్నాడు.