జిమ్ చేస్తే ప్రాణం పోతుందా.. అందరిలో భయం భయం?

praveen
ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండవచ్చు అని వైద్యులు సూచిస్తుంటారు. ఇక ఒకవేళ వ్యాయామానికి దూరంగా ఉంటే మాత్రం ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టి చివరికి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అని చెబుతూ ఉంటారు. ఇక వైద్యుడు చెప్పింది నమ్మి తరచూ వ్యాయామం చేస్తూ ఎంతో ఫిట్ గానే ఉన్నారు అందరు. కానీ ఇక ఎంత వ్యాయామం చేస్తే ఏం లాభం చివరికి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితివస్తుంది నేటి రోజుల్లో. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఒక మహిళ కింద పడింది. అయితే వెంటనే షాక్ అయినా జిమ్ నిర్వాహకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ పరిశీలించిన వైద్యులు  ఆమె మృతి చెందినట్లు అప్పటికి నిర్ధారించారు.


 వినయ కుమారీ అనే 44 ఏళ్ళ మహిళలు వ్యాయామం చేస్తూ కింద పడి ప్రాణాలు కోల్పోయిన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ జరిగిన ఘటన చిన్నదే అయినప్పటికీ ఇక గతంలో కూడా ఇలాంటి తరహా ఘటనలు పెద్దవాళ్ళ విషయంలోను జరిగాయి. ఏకంగా కన్నడ పవర్ స్టార్ గా కొనసాగుతున్న పునీత్ రాజ్కుమార్ వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించినా అప్పటికే చివరికి అప్పటికే ప్రాణాలు వదిలారు. దీంతో ఎంతో మంది అభిమానులు దిగ్భ్రాంతిలో మునిగిపోయారు.


 ఇక మొన్నటికి మొన్న ఏపీలో ఐటీ శాఖ మంత్రిగా కొనసాగుతున్న గౌతంరెడ్డి ఫిట్నెస్ కి  ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంతేకాదు బాడీ బిల్డర్ లాగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఇలా రోజు వ్యాయామం చేసే గౌతమ్ రెడ్డి హఠాత్తుగా గుండెపోటు గురికావడం గమనార్హం. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను  ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇవన్నీ ఘటనలు చూసిన తర్వాత వ్యాయామం చేస్తే ప్రాణాలు పోతాయా అనే అనుమానం అందరిలో నెలకొంది. ఇక దీనిపై వైద్యులు  స్పందించి జరుగుతున్న పరిణామాలు ఏంటి ఇక ఇలా వ్యాయామం చేసిన వాళ్ళు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారు అనే విషయాలపై ఒక నివేదిక ఇస్తేబాగుంటుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

Zym

సంబంధిత వార్తలు: