కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులను తగ్గించే ఆహారాలు..!!

Purushottham Vinay
ఇక ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా మనలో చాలా మందికి కూడా కాల్షియం లోపం కారణంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇంకా అలాగే నడుము నొప్పి వంటి సమస్యలతో తెగ బాధపడుతున్నారు.ఇక ఈ సమస్యల నుంచి బయట పడాలంటే కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవడం చాలా మంచిది..చాలా మంది కూడా ఇలాంటి నొప్పులు రాగానే పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటారు.కాని పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం అనేది అంత మంచిది కాదు.ఇక అలా కాకుండా కాల్షియం సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకుంటూ ఉంటే నొప్పుల నుండి వారికి సహజంగా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఇలాంటి ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవడం వారి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులను తగ్గించే ఆహారాలు.. ఆకుపచ్చని ఆకుకూరల్లో ఇంకా అలాగే కూరగాయల్లోనూ కాల్షియం అనేది చాలా సమృద్దిగా ఉంటుంది. కాబట్టి వారంలో మూడు రోజులు ఆకుకూరలు తీసుకోవడం చాలా మంచిది.


అలాగే ప్రతి రోజు కూడా ఒక గ్లాస్ పాలను తీసుకుంటే చాలా మంచిది.డ్రై ఫ్రూట్స్ లో కూడా కాల్షియం అనేది చాలా సమృద్దిగా ఉంటుంది. డాక్టర్స్ కూడా డ్రై ఫ్రూట్స్ తినమని అందరికి సిఫార్స్ చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ వలన ఎన్నో పోషకాలు అందటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఆరెంజ్ ఇంకా కమలలో విటమిన్-సి అలాగే కాల్షియం అనేది ఉంటుంది. ఒక కప్పు (200 గ్రాములు) ఒలిచిన నారింజ ఇంకా కమలలో 72.2 మి.గ్రా కాల్షియం ఉంటుంది.బీన్స్ పప్పు ధాన్యలులో క్యాల్షియం చాలా పుష్కలంగా ఉంటుంది. అలాగే వీటిలో కాల్షియంతో పాటు ప్రోటీన్, ఐరన్, జింక్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం ఇంకా అలాగే ఫైబర్ ఉంటుంది. ఇటువంటి ఆహారాలను తప్పనిసరిగా మీరు తీసుకునే ఆహారంలో బాగంగా చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: