నీళ్ళల్లో ఎక్సర్ సైజ్ చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా..!

MOHAN BABU
 మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినటమే, హెల్త్ బాగా ఉండాలంటే ఎక్సర్సైజులు ఎంతో అవసరం. మరి ఎలాంటి ఎక్సర్సైజులు చేస్తే మనకు మేలు చేస్తాయో తెలుసుకుందామా..! ఆక్వా ఏరోబిక్స్ ను వాటర్ ఏరోబిక్స్ అని కూడా అంటారు. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తూ స్విమ్మింగ్ ఫూల్ లో ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే అంతకు ముందుగా వాటర్ ఏరోబిక్స్ క్లాస్ అటెండ్ అయితే బాగుంటుంది. అందులోని టెక్నిక్, ప్రికాషన్స్  తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఏరోబిక్స్ అంటే లైట్ ఎక్సర్సైజ్. వామప్ కి నెక్స్ట్ లెవెల్. వాటర్ బాడీకి బాగా సపోర్ట్ ఇస్తుంది. నీళ్ల లో ఉన్నప్పుడు గ్రావిటీ, ఫ్రిక్షన్ తక్కువగా ఉంటాయి. అందువల్ల ఎక్సర్ సైజ్  చేసేటప్పుడు బోన్ జాయింట్స్ దగ్గర ఒత్తిడి తగ్గుతుంది. నీటిలో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కండరాలు మరింత స్ట్రాంగ్ అవుతాయి. నీటిని ముందుకీ, వెనక్కీ నెట్టడం వల్ల భుజాల్లో పవర్ పెరుగుతుంది.

 నడుము, తొడ, భుజాల్లో కండరాలు గట్టిప డతాయి. ఆక్వా ఏరోబిక్స్ హార్ట్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాడీ మొత్తం ఒకేలా ఉండటానికి నీటిలో చేసే ఈ వ్యాయామం చాలా మంచిది. బయట చేసే ఎక్సర్సైజ్ కన్నా వాటర్ లో కొంచెం ఎక్కువ సేపు చేయొచ్చు. అలసట తక్కువగా ఉంటుంది, ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సరైన బాడీ మాస్ ఇండెక్స్ మెయింటెన్  చేయడానికి ఇలాంటి ఎక్సర్సైజులు మంచివి. లంగ్స్ కెపాసిటీ కూడా పెంచు కోవచ్చు. మజిల్ స్ట్రెంత్, బాడీ ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి ఏరోబిక్ థెరఫీని ప్రిఫర్  చేస్తున్నారు. ఆక్వా ఏరోబిక్స్ తోపాటు ఆక్వా సైక్లింగ్,ఆక్వా జాగింగ్, ఆక్వా పోలో  వంటివి చేస్తుంటే ఎంకరే జింగ్ గా ఉంటాయి.ఆక్వా ఏరోబిక్స్ లొకేషన్ మూడ్ వల్ల స్ట్రెస్,యాంగ్జైటీ వంటి సమస్యలు తగ్గు తాయి. క్యాలరీలు కరిగి,బాడీ ఫ్యాట్ బాగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: