అల్జీమర్స్, చిత్తవైకల్యం రావడానికి 7 కారణాలు.. జాగ్రత్త పడండి?
మరి చిత్తవైకల్యం రావడానికి 7 కారణాలు ఉన్నాయి అని చెబుతున్నారు నిపుణులు.
ఆహారం మరియు వ్యాయామం : వ్యాయామానికి దూరంగా ఉండటం వల్ల కూడా చిత్తవైకల్యం వచ్చే అవకాశం ఉందట. చిత్త వైకల్యం ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రతిరోజు వ్యాయామం చేయడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా తృణ ధాన్యాలు గింజలు మరియు విత్తనాలు అధికంగా ఉండే ఆహారాన్ని అనుసరించే వారితో పోల్చితే అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే వ్యక్తుల్లో చిత్తవైకల్యం ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలిందని సూచించారు పరిశోధకులు.
అధికంగా మద్యం సేవించడం : అయితే ఆల్కహాల్ సేవించే వ్యక్తులలో మతిమరుపు ఎక్కువగా ఉంటుంది.. మధ్య వయసులో ఉన్నప్పుడు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే వృద్ధాప్యంలో చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. తరచు ఆల్కహాల్ సేవించడం వల్ల మెదడు పనితీరులో మార్పు వస్తుందని తద్వారా చిత్తవైకల్యం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఆల్కహాల్కు ఎంతో దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
హృదయనాళ ప్రమాద కారకాలు : బ్లడ్ ప్రెజర్, హైపర్ టెన్షన్, అల్జీమర్స్ లాంటివి చిత్తవైకల్యం ఎక్కువగా రావడానికి కూడా కారణం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ ఉండటం వల్ల కూడా చిత్తవైకల్యం వచ్చే అవకాశం ఉందట. అయితే మధ్య వయసులో ఊబకాయం హైబీపీ ఉన్నవారిలో కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయన నివేదిక చెబుతుంది అంటున్నారు నిపుణులు.
ఊబకాయం : స్థూలకాయం ఉన్న వ్యక్తుల్లో మిగతా వారితో పోలిస్తే 3.5 రెట్లు చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం ఉంది అని అంటున్నారు నిపుణులు. బెల్లీ ఫ్యాట్ మెదడుకు ఎంతగానో హాని కలిగిస్తుందని అంటున్నారు.
మధుమేహం : అయితే మధుమేహం కలిగి ఉండడం వల్ల కూడా చిత్తవైకల్యం ప్రమాదం మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ మధుమేహం సరైన నియంత్రణలో లేకపోతే రక్త నాళాలకు నష్టం కలిగిస్తుంది అని అంటున్నారు. ఇక ఇలా మెదడు నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వల్ల చిత్తవైకల్యం వైకల్యం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు.
ధూమపానం : ఇటీవలి కాలంలో ధూమపానం చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. అయితే ధూమపానం చిత్తవైకల్యం ప్రమాదం పెరగడానికి కారణం అవుతుందట. సిగరెట్లో ఉండే నికోటిన్ మెదడు ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అంతే కాదు రక్తనాళాల వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచుతుందట.
ఇలా చిత్తవైకల్యం నుంచి బయటపడటానికి ఒక వైపు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడమే కాదు. కాలుష్యరహిత ప్రాంతాలలో వుండే విధంగా చూసుకోవాలి. అంతేకాకుండా ధూమపానానికి మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. ప్రతిరోజూ వ్యాయామం లేదా యోగా అలాంటివి చేయడం వల్ల కూడా చిత్తవైకల్యం నుంచి బయటపడవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.