ఈ వ్యాయామాలతో ఒత్తిడి దూరం!

Veldandi Saikiran
ఆఫీసు పనులు మరియు ఇంట్లో పనులు చాలా మనుషులకు ఒత్తిడి కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అంతేకాదు పిల్లలలో కూడా చదువు మొదలైన వాటి కారణంగా ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఒత్తిడి అనే సమస్య వేధిస్తోంది. ఏ వయసు వారికైనా ఈ ఒత్తిడి సమస్య రావడం చాలా సులభం. అయితే ఈ ఒత్తిడిని ఎలా మనం దూరం చేసుకోవాలో ఇవాళ చూద్దాం.
స్ట్రెచింగ్ : మనం ఎక్ససైజ్ చేయడం కారణంగా మన శరీరంలో ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది. అలాగే ఎక్ససైజ్ చేశాక కానీ ఎక్ససైజ్ కు ముందు కానీ స్ట్రెచింగ్ చేస్తే మన శరీరంలో ఒత్తిడి అనే సమస్య అస్సలు రాదు. ముఖ్యంగా టెన్షన్ పూర్తిగా దూరం అవుతుంది. అలాగే మెదడు ఎంతో కూల్ గా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ ఎక్ససైజ్ చేసే టప్పుడు స్ట్రెచ్చింగ్ చేయాల్సి ఉంటుంది.
యోగా : మనం మనం ప్రతిరోజు ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాo. అయితే ఎక్సైజ్ ల కంటే యోగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. యోగా ప్రతిరోజు చేయడం కారణంగా మన శరీర ఆరోగ్యం అలాగే మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ  యోగా కారణంగా.. శరీరంలో ఒత్తిడి ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే మనకు చాలావరకు ప్రశాంతత దొరుకుతుంది.
రన్నింగ్ : మనం ఎక్ససైజ్ లతోపాటు ప్రతిరోజు రన్నింగ్ చేయడం చాలా మంచిది. రన్నింగ్ చేయడం కారణంగా ఒత్తిడి సమస్య తొందరగా దూరం అవుతుంది. అలాగే మన శరీరంలో ఉన్న అధిక బరువు సమస్యను కూడా రన్నింగ్ చేయడం వల్ల తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మన మెదడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. తద్వారా ఆఫీసు పనులు కానీ ఇంట్లో పనులు కానీ చాలా ప్రశాంతంగా చేసుకోగలుగుతాం. తద్వారా మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ నియమాలు పాటిస్తే ఒత్తిడిని త్వరగా తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: