మంచి నాణ్యమైన నిద్రని ఇలా పొందండి..!
స్లీపింగ్ పొజిషన్ : మనం నిద్ర పోయేటప్పుడు పడుకునే పొజిషన్... కరెక్ట్ ఉండాలి. పొట్ట అనుకుని మీరు నిద్రపోవడం అస్సలు మంచిది కాదు. పక్కకు తిరిగి పడుకున్న సరిపోదు. అందుకే మనం నిద్రించే డైరెక్షన్ చాలా ముఖ్యం.
మంచి పరుపు : మనం నిద్ర పోయేటప్పుడు పరుపు అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి మనం నాణ్యమైన పరుపులు మాత్రమే వాడాలి. తద్వారా మనకు మంచి నిద్ర వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే నడుము మరియు భుజం నొప్పి లాంటి అస్సలు మనకు రావు.
లైట్స్ అన్నీ ఆపేయాలి : చాలామంది నిద్రపోయే సమయంలో లైట్లను ఆఫ్ చేయకుండా నిద్రపోతారు. దీని కారణంగా చాలా మందికి నిద్రలేమి సమస్య తలెత్తుతోంది. కాబట్టి మనం నిద్రపోయే గదిలో కచ్చితంగా లైట్స్ అన్ని ఆఫ్ చేయాలి. వెలుతురు లేకుండా చూసుకుంటే చాలా మంచిది. తద్వారా మనకు మంచి నిద్ర పట్టవచ్చు. ఈ టిప్స్ పాటిస్తే మనం ప్రతిరోజు మంచి నిద్ర ను పొంద వచ్చు.