దేశంలో సిరంజీల కొరతా ఇంతగా ఉందా..?

MOHAN BABU
దేశ వైద్య ఆరోగ్య అవసరాలు, కరోనా నేపథ్యంలో సిరంజిల కొరత వంటి అనేక వైద్య పరిస్థితులు పై నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం దేశం సిరంజిల కొరతను ఎదుర్కొంటున్నది. ఇదే విషయమైన ప్రభుత్వానికి దేశంలోని సిరంజిల  ఉత్పత్తిదారులు సిరంజిల లోటు లేకుండా చూసుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించాలని గత ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వానికి పలుమార్లు గుర్తుచేస్తూ.. ప్రతిపాదనలు పంపాయి. అయితే ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా కోవిడ్  పరిస్థితుల్లో దేశం క్లిష్ట  పరిస్థితుల్లో కి జారుకోవడం తో పాటు covid-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కూడా ప్రభావం పడింది. అలాగే సిరంజిల తయారీలో ప్రత్యేక గుర్తింపు కలిగిన భారత్ కు అంతర్జాతీయ మార్కెట్లోనూ విశ్వసనీయతపై ప్రభావం పడింది. దీనికి తోడు సిరంజిల ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు మాత్రం విధించింది.

దేశంలో సిరంజిల కొరతకు సంబంధించి దారితీసిన పరిస్థితులు ప్రభుత్వ  నిర్లక్ష్య చర్యలపై సిరంజిస్ అండ్ మెడికల్ డివైజెస్ లిమిటెడ్ చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ నాథ్  ది వైర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. దేశంలో టీకాల కొరత ఉందని నాథ్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు దేశంలో తయారుచేయబడిన టీకాలు,ఈ నెల నుంచి టీకా కోసం ఉపయోగించే ఆటో డిసేబుల్ సిరంజిల ఉత్పత్తి రేటు కంటే చాలా ఎక్కువ. గతేడాది ఏప్రిల్ నుంచి తాము సిరంజిలకు కొరత లేకుండా ఉండటానికి, సరఫరా గొలుసు కు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉందని, బఫర్ స్టాక్ ను  సృష్టించడానికి ఒక ప్రత్యేక నిల్వ అవసరమని అన్నారు. ఎందుకంటే సిరాంజిల కంటే టీకాల లభ్యత ఎక్కువగా ఉన్న ప్రయోజనం ఉందా ? టీకాలు బుల్లెట్లు,అయితే వాటిని ఉపయోగించడానికి అవసరమైనవి తుపాకులు అవే..

ఇక్కడ సిరంజీలు.. అయితే ఇప్పుడు టీకాలు ఉన్నాయి కానీ సూదుల కొరత ఉందన్నారు. టీకాల కొరత తలెత్తే విషయం గురించి గత ఏడాది ఏప్రిల్లోనే ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రయత్నం జరిగింది. ఇదే విషయంపై తాము అంతర్జాతీయ సంస్థలను కూడా సంప్రదించగా..వారు గత ఏడాది జూన్,జూలై లోనే ప్రతిస్పందించారు . దీంతో ఆగస్టు నుంచి నిల్వలు పెంచడం ప్రారంభించారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించడానికి అక్టోబర్ వరకు సమయం తీసుకొని, డిసెంబర్ లో మొదటి ఆర్డర్ చేసిందన్నారు. ఇప్పటికీ పరిస్థితులు ప్రతికూలంగానే సాగుతున్నాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: