భార్యా భర్తల మధ్య గొడవలకు ఇలా చెక్ పెట్టండి?

Veldandi Saikiran
పెళ్లి అంటే మూడు ముళ్ల బంధం కాదని నూరేళ్ల జీవితం అని మన పెద్దలు అంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది... భార్య భర్తలు పెద్దల మాటలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉంటారు. దీని వల్ల ఆ భార్యాభర్తల మధ్య అనేక సమస్యలు వస్తాయి. తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. వారి మధ్య ప్రేమానురాగాలు మసకబారిపోతాయి. అయితే ఇలాంటి... సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 ప్లాన్ చేయవద్దు : మనం ఎప్పుడైనా ప్రణాళిక చేసుకోవద్దు. ప్లాన్ లేకుండా గడిచిన నిమిషాలే చాలా ఆనందంగా ఉంటాయి. ఏదో ఒక రోజున చేతిలో మల్లె పూలు పెట్టుకొని ఇంటికి వచ్చిన రోజు... ఇక వారికి పండగే. ఆరోజు భార్యాభర్తలకు మరిచిపోలేని రోజుగా మారుతుంది. ఇక మహిళలు అయితే... ఎక్కువ మేకప్ లేకుండా సాధారణంగా ఉంటే సరిపోతుంది. ఇక ఆరోజు కోర్కెలు బాగా వచ్చి మీ భాగస్వామితో ఎంజాయ్ చేయవచ్చు.
బయటకు వెళ్ళటం : మన నిత్య జీవితంలో ఉల్లాసం అనేది చాలా ముఖ్యమైన అంశం. అయితే  ఎప్పుడూ ఇంట్లో ఉండేవారికి... ఈ ఉల్లాసం లభించక పోవచ్చును. దీనివల్ల భార్య భర్తల మధ్య గొడవ లకు దారి తీసే అవకాశం కూడా ఉంది. కాబట్టి  వారంలో ఒక్కరోజైనా... అలా బయట సరదాగా గడిపితే బంధాలు విధిస్తాయి. బయటి వాతావరణంలో భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది.
సర్ ప్రైజ్ : మన లవ్ ను ఎక్స్ప్రెస్ చేయడం చాలా ముఖ్యమైన అంశం. ఈ ప్రేమ ను చెప్పటం ఒకరు ఒక విధంగా మరొకరు మరోలా చెబుతారు. బయటివారికి నచ్చిన వస్తువు లేదా వేరే ఇతర పనులు చేసి వారిని సంతోష పెడతారు. ముఖ్యంగా వారికి ఇష్టమైన వస్తువులు కొనిచ్చి సప్రైజ్ చేస్తారు. అలా చేయటం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.

ఒక ఇంటిపనుల్లో భాగం కావటం : మన సమాజంలో చాలామంది భార్యాభర్తలు చేసే మొదటి తప్పు ఇదే కావడం విశేషం. మిగతావారి  పనులను అస్సలు పట్టించుకోరు. ఇలా చేయటం కారణంగా అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ఇంట్లో ఉన్న భాగస్వామి పనులకు కాస్తంత పురుషులు సహాయం చేస్తే... వారి మధ్య ఎంతో అనుబంధం పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: