వారికి క‌రోనా కంటే వ్యాక్సినే ముప్పు?

Dabbeda Mohan Babu
క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు మృత్యువాత ప‌డ్డారు. ఈ భ‌య‌క‌రం మైన క‌రోనా వైర‌స్ నుంచి ర‌క్షించుకోవాడానికి శాస్త్ర‌వేత్త‌లు వ్యాక్సిన్ ల‌ను క‌నుగొన్నారు. అన్ని దేశాల ప్ర‌భుత్వాలు త‌మ దేశ పౌరుల‌కు ఈ వ్యాక్సిన్ లను త‌ప్ప‌ని స‌రి చేశారు. దాదాపు అన్ని దేశాలు త‌మ ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ ల‌ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్ర‌స్తుతం అన్ని దేశాల్లో 18 సంవ‌త్స‌రాలు నిండిన వారికి వ్యాక్సిన్ లు వేస్తున్నారు. ఈ 18 సంవ‌త్స‌రాలు నిండిన వారికి ఎ వ్యాక్సిన్ లు వేసినా ఎలాంటి దుష్ప్ర‌భావాలు రాలేదు.
కానీ ఇటీవ‌ల 12 నుంచి 15 సంవ‌త్స‌రాల అబ్బాయిల‌కు మ‌ధ్య ఉన్న వారికి వ్యాక్సిన్ లు వేస్తే తీవ్ర మైన దుష్ప్ర‌భావాలు చూపుతున్నాయ‌ని తాజాగా శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌క‌టించారు. క‌రోనా వ‌చ్చి హాస్ప‌టెల్ లో చేరిన వారితో పోలిస్తే.. వారికి వ్యాక్సిన్ లు వేయ‌డం వ‌ల్ల ఆరు రేట్లు ఎక్కువ ప్ర‌మాదమ‌ని  కాలిఫోర్నియా యూనివ‌ర్సిటి డాక్ట‌ర్ ట్రేసి హోగ్ నేత్రుత్వంలోని ప‌రిశోద‌క బృందం వెళ్ల‌డించారు. వారికి తీవ్ర‌మైన గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వారు క‌నుగొన్నారు. 12 నుంచి 15 ఏళ్ల మ‌ధ్య ఉన్న అబ్బాయిల రెండు డోసుల టీకాలు తీసుకున్న త‌ర్వాత వారికి కార్డియాక్ అడ్వ‌ర్వ్ ఈవెంట్ అనే గుండె సంబంధ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డ‌తున్నార‌ని తెలిపారు. ఈ ఎజ్ గ్రూప్ వారికి మార్జిన్ ఆఫ్ బెనిఫిట్ చాలా త‌క్కువ‌గా ఉంటుందని అన్నారు. అందు వ‌ల్ల ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకున్న ప్ర‌తి 12 నుంచి 15 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల అబ్బాయిల‌కు గుండె స‌మ‌స్య‌ల తీవ్ర‌త ప్ర‌తి మిలియ‌న్ కు 162.2 గా ఉన్న‌ట్టు ప‌రిశోధ‌కులు క‌నుగొన్నారు. ఈ ఎజ్ గ్రూప్ వారికే ఇది ఎక్కువ‌గా ఉంద‌ని వారు వెల్ల‌డించారు. త‌ర్వాత 16 నుంచి 17 వ‌య‌స్సు గ‌ల బాలిక‌ల‌కు ప్ర‌తి మిలియ‌న్ కు 94 గా ఉంద‌ని అన్నారు.  ఈ గుణాంకాల‌న్నీ ఈ ఏడాది జ‌న‌వ‌రి - జూన్ మ‌ధ్య టీకా వేసుకున్న వారిపై విశ్లేష‌ణ చేస‌న‌ది. వీరు ఫైజ‌ర్‌, మోడ‌ర్నా వంటి టీకాల‌ను అధ్య‌యానం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: